• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SHANKAR TO WORK WITH RANVEER SINGH FOR ANNIYAN REMAKE SR

Shankar : రణ్ వీర్ సింగ్‌తో మరో సినిమాను ప్రకటించిన శంకర్.. మరి రామ్ చరణ్ సినిమా పరిస్థితి..

Shankar : రణ్ వీర్ సింగ్‌తో మరో సినిమాను ప్రకటించిన శంకర్.. మరి రామ్ చరణ్ సినిమా పరిస్థితి..

Shankar, Ranveer Singh and Jayantilal Gada Photo : Instagram

Shankar : తమిళ మెగా డైరెక్టర్ శంకర్ ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    Shankar : తమిళ మెగా డైరెక్టర్ శంకర్ ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ జూన్‌లో ప్రారంభమౌతుందని, సినిమాలో సల్మాన్‌కు ఓ కీలక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఉంటుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నట్లు టాక్. కియారా గతంలో రామ్ చరణ్ సరసన వినయ విదేయ రామలో నటించిన సంగతి తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అది అలా ఉంటే ఆయన మరో సినిమాను కూడా ప్రకటించాడు. హిందీ సూపర్ స్టార్ రణ్ వీర్ సింగ్ ఈ తాజా సినిమా ఉండనుంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది చిత్రబృదం. ఈ విషయాన్ని రణ్‌వీర్ స్వయంగా తన ఇన్‌స్టాలో ప్రకటించాడు. శంకర్‌తోపాటు ప్రొడ్యూసర్ జయంతిలాల్‌తో కలిసి ఉన్న ఫొటోను రణ్‌వీర్ ఈ సందర్భంగా షేర్ చేశాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది తమిళ బ్లాక్ బస్టర్ హిట్ అన్నియన్‌ (2005) చిత్రానికి రీమేక్ వస్తోంది. ఇదే సినిమాను తెలుగులో అపరిచితుడు అంటూ డబ్ చేసిన సంగతి తెలిసిందే. విక్రమ్, సదా ప్రధాన పాత్రలో నటించారు.

    ఈ సినిమాను పెన్ మూవీస్ నిర్మించనుంది. ఈ పెన్ మూవీస్ ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న ఖిలాడిని నిర్మిస్తోంది. అంతేకాదు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు చత్రపతి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. వినాయక్ దర్శకుడు.



    ఇక రణ్‌వీర్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం 'సూర్యవంశీ, 83' సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇక 'జయేష్‌భాయ్ జోర్ దార్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. శంకర్ విషయానికి వస్తే. కమల్ హాసన్ తో 'ఇండియన్2' సినిమాను చేస్తున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దీంతో శంకర్ రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీని ప్రకటించాడు. ఈ సినిమా తర్వాత అన్నియన్ రీమేక్ ఉంటుంది. ఈ సినిమా 2022 వేసవిలో ప్రారంభం కానుందట.
    Published by:Suresh Rachamalla
    First published: