Home /News /movies /

SHANKAR RAM CHARAN DIL RAJU MEGA POWER STAR RAM CHARAN DIL RAJU METS DIRECTOR SHANKAR FOR PAN INDIA PROJECT TA

Shankar - Ram Charan - Dil Raju: దర్శకుడు శంకర్‌తో హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు ప్రత్యేక భేటి..

రామ్ చరణ్,శంకర్, దిల్ రాజు ప్రత్యేక భేటి (Twitter/Photo)

రామ్ చరణ్,శంకర్, దిల్ రాజు ప్రత్యేక భేటి (Twitter/Photo)

Shankar - Ram Charan - Dil Raju: దర్శకుడు శంకర్‌తో హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు ప్రత్యేక భేటి అయ్యారు.

    Shankar - Ram Charan - Dil Raju: దర్శకుడు శంకర్‌తో హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు ప్రత్యేక భేటి అయ్యారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో దిల్ రాజు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ మూడు అడుగులు ముందుకు .. ఆరు అడుగులు వెనక్కి అన్నట్టు వ్యవహారం నడుస్తోంది. ఐతే.. శంకర్, దిల్ రాజు కాంబినేషన్‌లో సినిమా ఎపుడో తెరకెక్కాల్సింది. అది కూడా కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమా. అప్పట్లో ఈ మూవీపై అఫీషియల్  ప్రకటన కూడా చేసారు. ఆ తర్వాత ఏమైందో  ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు చేయనని చెప్పడంతో శంకర్, కమల్ హాసన్ ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌లో చేసారు. మరోవైపు దిల్ రాజు.. ‘భారతీయుడు 2’ సినిమా అపుడు శంకర్ పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చారు.  ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదు. దానికి బదులు దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తానని చెప్పారు. దీంతో దిల్ రాజు.. దర్శకుడు శంకర్‌‌, రామ్ చరణ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసారు.

    ఐతే.. శంకర్ మాత్రం కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమాను పూర్తి చేయాలి. కానీ ఇప్పటికే ఈ సినిమా పలు కారణాలతో షూటింగ్  వాయిదా పడుతూ వచ్చింది. మరో రెండు నెలలు చేస్తే కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు.  మరోవైపు లైకా ప్రొడక్షన్స్ వాళ్లు ముందుగా కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమాను పూర్తి చేసిన తర్వాత కానీ వేరే సినిమా చేయడానికి వీలు లేదు అంటూ కోర్టు కెక్కరు. దీంతో ఎపుడో పట్టాలెక్కాల్సిన  రామ్ చరణ్, శంకర్ సినిమా మరింత ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా భారతీయుడు సినిమా విషయంలో శంకర్‌కు ఊరట లభించింది. దీంతో రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా విషయమై ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు.


    ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ రామ్ చరణ్, దిల్ రాజు, శంకర్ ఎపుడు కలవలేదు. తాజాగా రామ్ చరణ్, దిల్ రాజు కలిసి శంకర్‌తో ఈ ప్రాజెక్ట్ పై చర్చించారు. ఇప్పటికే రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్‌తో పాటు ‘ఆచార్య’ సినిమాలు కంప్లీట్ చేసి ఫ్రీ అయ్యారు. ఆర్ఆర్ఆర్‌లో కేవలం ఒక పాట మాత్రమే చేయాల్సి ఉంది. ఒక పది రోజులు షూట్ చేస్తే ఆ పాట కూడా కంప్లీట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను ఆగష్టు ఫస్ట్ వీక్‌లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

    Ram Charan Shankar Dil Raju Mega Project Going To Sets On August Month and Thaman To Compose Music This Crazy Project,Ram Charan - Shankar: శంకర్, రామ్ చరణ్ సినిమాకు సర్వం సిద్ధం.. సెట్స్ పైకి వెళ్లేది అపుడే..,Ram Charan,Shankar,Ram Charan Shankar Crazy Update,Ram Charan Shankar Salman Khan,Ram Charan Shankar Ranveer Singh,Ram Charan Shankar Chiranjeevi Pawan Kalyan,Ram Charan Shankar Updendra,Ram Charan Shankar Sudeep,Ram Charan Shankar Mohanlal,Ram Charan Shankar vijay sethpathi,Ram Charan Shankar Suriya,Ram Charan Shankar film update, salman khan, Ram Charan Shankar film update salman khan will be seen in a key role, Ram Charan Shankar film, anirudh ravichander , Ram Charan news, Ram Charan Shankar film update, Ram Charan films, Ram Charan birthday celebrations, Ram Charan birthday,Ram Charan letter to fans,Ram Charan on corona,Ram Charan to Romance with Alia Bhatt for Rajamouli RRR,alia bhatt,ram charan,alia bhatt and ram charan to romance in ss rajamouli’s rrr,ss rajamouli,alia bhatt movies,rrr movie,alia bhatt, ram charan songs,alia bhatt ranbir kapoor love story,alia bhatt rrr,ram charan rrr teaser,alia bhatt's inshallah movie,రామ్ చరణ్,రామ్ చరణ్ లేఖ, రామ్ చరణ్ పుట్టిన రోజు,రామ్ చరణ్ శంకర్,రామ్ చరణ్ శంకర్ సినిమాలో సల్మాన్ ఖాన్,రామ్ చరణ్ శంకర్ సినిమాలో చిరంజీవి పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ శంకర్ ఉపేంద్ర సుదీప్,రామ్ చరణ్ శంకర్ రణ్‌‌వీర్ సింగ్,రామ్ చరణ్ శంకర్ విజయ్ సేతుపతి సూర్య
    శంకర్, రామ్ చరణ్ : Twitter


    ఇప్పటికే తమన్ ఆధ్వర్యంలో కొన్ని పాటలను కూడా రికార్డు కూడా చేసారట.  ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న  లేదా కియారా అద్వానీ నటించే అవకాశాలున్నాయి. వీళ్లిద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్.. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా దిల్ రాజు 50వ చిత్రం. దీంతో ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

    shankar shnmugam,shankar shnmugam twitter,shankar ram charan movie,shankar hindi remake anniyan movie,shankar ranveer singh movie,shankar anniyan remake ranveer singh,tamil cinema,శంకర్,శంకర్ సినిమాలు,శంకర్ అపరిచితుడు రీమేక్
    శంకర్, రామ్ చరణ్ మూవీ (Twitter/Photo)


    ఈ సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ నుంచి పాలిటిక్స్‌లోకి  వచ్చి వ్యవస్థను చక్కదిద్దే పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది. అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Dil raju, Kollywood, Pan india movie, Ram Charan, Shankar, Tollywood

    తదుపరి వార్తలు