బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి చైనా వెళుతున్న రజినీకాంత్ ‘2.O’

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు కనీవినీ ఎరగనీ రీతిలో భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన ‘2.O’ మూవీని వచ్చే యేడాది మే నెలలో  చైనాలో పదివేల థియేటర్స్‌లో ఉన్న 56 వేల స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా ప్రకటించింది.

news18-telugu
Updated: December 5, 2018, 4:58 PM IST
బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి చైనా వెళుతున్న రజినీకాంత్ ‘2.O’
2.O చైనా పోస్టర్
  • Share this:
గత కొన్నేళ్లుగా భారతీయ సినిమాలకు వాల్డ్ వైడ్ గా మంచి మార్కెట్ ఏర్పడింది. ఆల్రెడీ ఇక్కడ భారతీయ హీరోలెవరికి విదేశాల్లో అంతగా మార్కెట్ లేని టైమ్‌లోనే జపాన్‌లో ‘ముత్తు’ సినిమాతో సంచలనాలు నమోదు చేసాడు.

తాజాగా రజినీకాంత్..బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో కలిసి శంకర్ దర్శకత్వంలో నటించిన ‘2.O’ సినిమాను చైనాలో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నట్టు ఈ మూవీ నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ వాళ్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

నవంబర్ 29న  విడుదలైన ఈ మూవీని రిలీజైన అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు రూ.400 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు ఈచిత్ర నిర్మాతలు ప్రకటించారు.ఒక్క హిందీ వెర్షన్ రూ.122 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో దాదాపు రూ.45  కోట్ల షేర్ రాబట్టింది.

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు కనీవినీ ఎరగనీ రీతిలో భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన ‘2.O’ మూవీని వచ్చే యేడాది మే నెలలో  చైనాలో పదివేల థియేటర్స్‌లో ఉన్న 56 వేల స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా ప్రకటించింది.


ఈ మూవీ కోసం చైనాలో కొన్ని థియేటర్స్‌ను 3Dలోకి మార్చనున్నారు. ఒక్క 3D వెర్షన్‌లోనే  ఈ మూవీని 47వేల స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. చైనాలో ఇంత భారీ స్థాయిలో 3Dలో విడుదలైవుతున్న భారతీయ చిత్రంగా ‘2.O’ రికార్డు క్రియేట్ చేయబోతుంది.హెచ్.వై అనే మీడియా అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ 2.0 చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘2.O’ మంచి వసూళ్లనే రాబడుతోంది. మొత్తానికి ‘ముత్తు’తో జపాన్ దేశంలో మార్కెట్ క్రియేట్ చేసుకున్న రజినీకాంత్...2.O’ మూవీతో చైనా బాక్సాఫీస్ కింగ్ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.


ఇది కూడా చదవండి 

అప్పుడు మ‌హాన‌టి సావిత్రి.. ఇప్పుడు స‌మంత అక్కినేని..

సినిమా చూపిస్తా మావ…కథలో కథానాయకులు

రూ.300 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు ‘గంట’ కొట్టిన విక్రమ్
Published by: Kiran Kumar Thanjavur
First published: December 5, 2018, 4:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading