"2.0" బడ్జెట్ 543 కోట్లా.. అసలు అవి డబ్బులేనా శంకర్..?

ముందు 250 కోట్లు అనుకుని మొద‌లుపెట్టిన "2.0" ప్రాజెక్ట్ కాస్తా 300.. 350.. 450 కోట్లు దాటేసి ఇప్పుడు 543 కోట్ల ద‌గ్గ‌ర ఆగింది. అస‌లు ఈ బ‌డ్జెట్ వింటుంటేనే గుండెలు ఆగిపోయితున్నాయి. ఎంత డైజెస్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా ఒక్క సినిమా కోసం ఇన్నేసి వంద‌ల కోట్లు పెట్టించ‌డం మాత్రం కాస్త అతిగానే అనిపిస్తుంది. ఇంత వ‌సూలు చేయాలంటే సినిమా ఎంత వ‌సూలు చేయాలి..?

news18-telugu
Updated: September 12, 2018, 10:37 PM IST
2.0 పోస్టర్
  • Share this:
నిజ‌మా..? ఒక్క సినిమా కోసం 543 కోట్లు పెట్టిస్తున్నాడా..? ఈ డ‌బ్బుతో ఓ హాలీవుడ్ సినిమానే తీయొచ్చు క‌దా అనుకుంటున్నారా..? అవును.. నిజమే కానీ శంక‌ర్ ఓ ఇండియ‌న్ సినిమా చేసాడు. క‌నీసం ఏ ద‌ర్శ‌కుడు క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా ఈయ‌న 543 కోట్లు ఖ‌ర్చు చేయించి "2.0" సినిమా చేసాడు. అస‌లు ఈ బ‌డ్జెట్ వింటేనే గుండె ఆగిపోతుంది క‌దా..? న‌మ్మ‌డానికి కాస్త టైమ్ ప‌ట్టినా ఇదే నిజం ఇప్పుడు. ఎందుకంటే ఈ చిత్ర న‌టుడు.. హీరో అక్ష‌య్ కుమార్ ఈ బ‌డ్జెట్ క‌న్ఫ‌ర్మ్ చేసాడు.

shankar-rajini-akshay kumar 2.0 budget 543 crores..
2.0 పోస్టర్


తాను బాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 130 సినిమాలు చేసాన‌ని.. ఇది 131వ సినిమా అని.. ప్ర‌తీ సినిమాతో ఏదో ఒక‌టి నేర్చుకుంటున్న త‌న‌కు శంక‌ర్ ఇంకాస్త కొత్త‌గా చాలా నేర్పించార‌ని చెప్పాడు ఈ ఖిలాడీ. అస‌లు ముందు 250 కోట్లు అనుకుని మొద‌లుపెట్టిన "2.0" ప్రాజెక్ట్ కాస్తా 300.. 350.. 450 కోట్లు దాటేసి ఇప్పుడు 543 కోట్ల ద‌గ్గ‌ర ఆగింది. అస‌లు ఈ బ‌డ్జెట్ వింటుంటేనే గుండెలు ఆగిపోయితున్నాయి. ఎంత డైజెస్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా ఒక్క సినిమా కోసం ఇన్నేసి వంద‌ల కోట్లు పెట్టించ‌డం మాత్రం కాస్త అతిగానే అనిపిస్తుంది.

shankar-rajini-akshay kumar 2.0 budget 543 crores..
శంకర్ (ట్విట్టర్ ఫోటో)
ఇంత వ‌సూలు చేయాలంటే సినిమా ఎంత వ‌సూలు చేయాలి..? ఎంత అద్భుతంగా ఆడాలి..? మ‌రి అంత విష‌యం "2.0"లో ఉంటుందా..? ఒక‌వేళ ఏదైనా అదృష్టం బాగోలేక అది మిస్ అయిందే అనుకోండి.. నిర్మాత‌ల ప‌రిస్థితి ఏంటి..? అక్క‌డ ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 543 కోట్లు. హాలీవుడ్ సినిమాల‌కు కూడా పెట్ట‌నంత బ‌డ్జెట్ అది.

shankar-rajini-akshay kumar 2.0 budget 543 crores..
2.0 పోస్టర్


ఒక‌ప్పుడు "ఎక్స్ మెన్" కోసం 543 కోట్లు పెట్టారు. ఇప్పుడు అంత బ‌డ్జెట్ ఈ ఒక్క సినిమాకే పెట్టించాడు శంక‌ర్. హాలీవుడ్ లో వ‌చ్చిన విజువ‌ల్ వండ‌ర్స్ "బ్యాట్‌మెన్".. "డెడ్‌పూల్" కంటే కూడా "2.0" బ‌డ్జెట్ ఎక్కువ‌. ఈ ఒక్క సినిమా కోస‌మే ప్ర‌పంచ వ్యాప్తంగా 3000 మంచి టెక్నీషియ‌న్స్ మూడేళ్లుగా క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నారు. సినిమా అంతా 3డిలోనే తెర‌కెక్కించాడు శంక‌ర్. హాలీవుడ్ సినిమాల‌ను సైతం ముందు 2డిలో తీసి.. ఆ త‌ర్వాత 3డిలోకి మారుస్తుంటారు. కానీ శంక‌ర్ మాత్రం ఈ సినిమాను మొత్తం 3డిలోనే తెర‌కెక్కించ‌డం విశేషం.
Loading...
shankar-rajini-akshay kumar 2.0 budget 543 crores..
2.0 ఎక్స్ మెన్ బ్యాట్‌మెన్ పోస్టర్స్ న్యూస్ 18


హాలీవుడ్ సినిమాల‌కు సైతం సాధ్యం కాని ఫీట్ ఇది. దీనికోస‌మే ఎక్కువ టైమ్ తీసుకున్నాడు శంక‌ర్. అన్ని ముగించుకుని న‌వంబ‌ర్ 29న సినిమా విడుదల‌కు సిద్ధ‌మైంది. సెప్టెంబ‌ర్ 13న టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఇది చూసిన త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు ఇంకెంత‌గా పెర‌గ‌బోతున్నాయో అర్థం అవుతుంది. బిజినెస్ ప‌రంగా కూడా "2.0" సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ర‌జినీకాంత్.. అక్ష‌య్ కుమార్ లాంటి సూప‌ర్ స్టార్స్ ఉండ‌టంతో బిజినెస్ కూడా ఈజీగా 500 కోట్ల కంటే పైగానే జ‌రుగుతుంది. అయితే ఎంత సూప‌ర్ స్టార్స్ ఉన్నా కూడా మ‌రీ 500 కోట్లంటే చిన్న విష‌యం కాదు. మ‌రి చూడాలిక‌.. "2.0"తో ఎలాంటి అద్భుతానికి శంక‌ర్ తెర తీయ‌బోతున్నాడో..?
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...