రామ్ చరణ్ (Ram Charan) హీరోగా డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. RC15 వర్కింగ్ టైటిల్‌లతో వస్తున్న ఈ సినిమా భారీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ (Kiara Advani) నటించనుంది. అది అలా ఉంటే ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్‌గా ఉంటుందని తెలుస్తోంది. కేవలం ఆ సన్నివేశానికే 10 కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నారట. ఈ ఫైట్ సీన్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా ఉండనున్నదని తెలుస్తోంది. ఈ యాక్షన్ స్టంట్ లో రామ్ చరణ్‌తో పాటు వందలాది మంది ఫైటర్స్ పాల్గొంటారని సమాచారం అందుతోంది.
ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేక రైలు సెట్ ను కూడా నిర్మిస్తున్నారట చిత్రబృందం. ఇక ఈ చిత్రం అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నదని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
NTR | Mahesh Babu : ఎన్టీఆర్ షోలో పాతిక లక్షలు గెలిచిన మహేష్ బాబు.. ప్రసారం ఎప్పుడంటే..
ఈ సినిమా ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) క్లాప్ కొట్టారు. దర్శకుడు రాజమౌళి (Rajamouli), బాలీవుడ్ క్రేజీ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ముఖ్య అతిథులుగా హాజరైయారు.
ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు. డా. సి.నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ టైటిల్ ఏ మేరకు న్యాయం చేస్తారనేది చూడాలి.
రౌద్రం రణం రుథిరం విషయానికి వస్తే..
ఇక రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్ ఉక్రెయిన్‌లో చిత్రీకరణ జరుపుకుని ఇటీవలే హైదరాబాద్ చేరుకుంది టీమ్. రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. రౌద్రం రణం రుథిరం పేరుతో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan)తో పాటు (NTR) ఎన్టీఆర్ నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ధర ఎంతో తెలిస్తే...పట్టపగలే చుక్కలు కనపడతాయి..
వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ (Alia Bhatt) నటిస్తున్నారు. ఇక సెకండ్ వేవ్ కరోనా కేసులు తగ్గడంతో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోందని గతంలో ప్రకటించగా... ఆ విడుదలను (RRR Release Date) మరోసారి వాయిదా వేసింది చిత్రబృందం.
దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసిన టీమ్.. ఈ సందర్భంగా రాస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో మా సినిమాను విడుదల చేయలేము. అంతేకాదు కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించలేము.. అన్ని అనుకూలించిన తర్వాత మా సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ప్రకటిస్తాము అంటూ ఓ పోస్ట్ చేశారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఉక్రెయిన్ వెళ్లి ఇటీవలే వచ్చింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్..
ఇక అది అలా ఉంటే రామ్ చరణ్ (Ram Charan-Disney hotstar) ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌కు (Disney hotstar) బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సంగతి తెలిసిందే. ‘మన వినోద విశ్వం’ అనే ట్యాగ్‌లైన్‌తో తెలుగులో డిస్నీ హాట్ స్టార్‌ను రామ్ చరణ్ ప్రమోట్ చేయనున్నారు. అయితే దీని కోసం రామ్ చరణ్‌కి డిస్నీ హాట్ స్టార్ భారీగానే ముట్టజెప్పినట్టు సమాచారం. ఆయనకు ఏడాదికి 5 నుంచి 7 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiara advani, Ram Charan, Shankar, Tollywood news