హోమ్ /వార్తలు /సినిమా /

Director Shankar: దర్శకుడు శంకర్ ఇక ఆ సినిమాలకే పరిమితమా..

Director Shankar: దర్శకుడు శంకర్ ఇక ఆ సినిమాలకే పరిమితమా..

శంకర్ (File/Photo)

శంకర్ (File/Photo)

Director Shankar | హీరో విక్రమ్‌తో తెరకెక్కించిన ‘ఐ’ మూవీ ఎఫెక్ట్‌తో శంకర్ పూర్తిగా మారిపోయాడు. ఈ మూవీ తర్వాత కొత్త కథలతో ప్రయోగం చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో...తన పాత చిత్రాలకు కొనసాగింపుగా సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు.

  హీరో విక్రమ్‌తో తెరకెక్కించిన ‘ఐ’ మూవీ ఎఫెక్ట్‌తో శంకర్ పూర్తిగా మారిపోయాడు. ఈ మూవీ తర్వాత కొత్త కథలతో ప్రయోగం చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో...తన పాత చిత్రాలకు కొనసాగింపుగా సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు. సామాజిక స్రృహ ఉన్న సినిమాలు తీయడంలో శంకర్ ఎక్స్‌పర్ట్. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చాలా చిత్రాలు సోషల్ అవేర్‌నెస్‌తో పాటు ఎవరు టచ్ చేయని  సబ్జెక్ట్స్‌తో తెరకెక్కడం విశేషం.ఇప్పటికే రజినీకాంత్, అక్షయ్ కుమార్‌లతో రోబో మూవీకి సీక్వెల్‌గా ‘2.O’ మూవీ చేసాడు. ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చిన వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించాయి.ఈ మూవీ చివర్లో ‘చిన్ని’ వెర్షన ‘3.O’ అంటూ ఈ మూవీకి కొనసాగింపుగా మూడో సీక్వెల్ తెరకెక్కస్తానని చెప్పాడు.ఇప్పటికే ‘3.O’ వెర్షన్‌కు సంబంధించిన కథను రెడీ చేయించేపనిలో ఉన్నాడు శంకర్.

  రోబో సీక్వెల్ 3.0 కు ప్లాన్ చేస్తోన్న శంకర్ (File/Photo)

  ప్రస్తుతం శంకర్..కమల్ హాసన్‌తో ‘భారతీయుడు2’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏ ముహూర్తానా ఈ సినిమాకు స్టార్ట్ చేసారో.. అప్పటి నుంచి ఈ సినిమా మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో కొంత మంది టెక్నీషియన్స్ ప్రమాదంలో చనిపోవడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దానికి తోడు కరోనా కూడా తోడైంది. ఈ సినిమాను ఎపుడు మళ్లీ సెట్స్ పైకి తీసుకెళతారో చూడాలి. ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు జోడిగా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

  ఇండియన్ 2 మూవీ పోస్టర్ (Twitter/Photo)

  ‘భారతీయుడు2’ మూవీ తర్వాత శంకర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీతో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్‌తో శంకర్ తెరకెక్కించిన ‘ఒకే ఒక్కడు’ మూవీని విజయ్ హీరోగా సీక్వెల్ చేసే ఆలోచనలో శంకర్ ఉన్నట్టు సమాచారం. ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. ఈ మూవీని హిందీలో అనిల్ కపూర్ హీరోగా ‘నాయక్’ గా శంకర్ రీమేక్ చేసాడు.బాలీవుడ్‌లో కూడా ఓ మోస్తరుగా నడిచింది. ఇపుడీ మూవీకి సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. ఈ రీమేక్‌లో విజయ్ హీరోగా నటించే అవకాశం ఉంది.

  విజయ్‌తో ఒకే ఒక్కడు సీక్వెల్‌ను ప్లాన్ చేసిన శంకర్ (Twitter/Photo)

  దాంతో పాటు నిర్మాత కుంజుమోన్ జెంటిల్మెన్ 2 ప్రకటించాడు. కానీ హీరో, దర్శకులు ఎవరనేది ప్రకటించలేదు. ఐతే.. ఈ సీక్వెల్‌లో విజయ్ నటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  కానీ నిర్మాత మాత్రం కన్ఫామ్ చేయలేదు. కానీ అప్పట్లో శంకర్ కూడా ఈ సినిమాకు  సీక్వెల్ తీసే ఆలోచన ఉందని చెప్పాడు.మొత్తానికి శంకర్..కొత్త స్టోరీలతో కుస్తీ పట్టడం కన్నా...పాత స్టోరీలతో సీక్వెల్‌ తీసే పనిలో పడ్డాడని అందరు చెప్పుకుంటున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Shankar, Tollywood

  ఉత్తమ కథలు