కొత్త కథలు వద్దు..పాత కథలే ముద్దు..సీక్వెల్స్‌కు జై కొడుతున్న శంకర్

‘ఐ’ మూవీ ఎఫెక్ట్‌తో శంకర్ పూర్తిగా మారిపోయాడు. ఈ మూవీ తర్వాత కొత్త కథలతో ప్రయోగం చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో...తన పాత చిత్రాలకు కొనసాగింపుగా సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు.

news18-telugu
Updated: December 6, 2018, 10:15 PM IST
కొత్త కథలు వద్దు..పాత కథలే ముద్దు..సీక్వెల్స్‌కు జై కొడుతున్న శంకర్
శంకర్ ట్విట్టర్ ఫోటో
  • Share this:
‘ఐ’ మూవీ ఎఫెక్ట్‌తో శంకర్ పూర్తిగా మారిపోయాడు. ఈ మూవీ తర్వాత కొత్త కథలతో ప్రయోగం చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో...తన పాత చిత్రాలకు కొనసాగింపుగా సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు. సామాజిక స్రృహ ఉన్న సినిమాలు తీయడంలో శంకర్ ఎక్స్‌పర్ట్. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చాలా చిత్రాలు సోషల్ అవేర్‌నెస్‌తో పాటు ఎవరు టచ్ చేయని  సబ్జెక్ట్స్‌తో తెరకెక్కడం విశేషం.

ఇప్పటికే రజినీకాంత్, అక్షయ్ కుమార్‌లతో రోబో మూవీకి సీక్వెల్‌గా ‘2.O’ మూవీ చేసాడు. ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చిన ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ చివర్లో ‘చిన్ని’ వెర్షన ‘3.O’ అంటూ ఈ మూవీకి కొనసాగింపుగా మూడో సీక్వెల్ తెరకెక్కస్తానని చెప్పాడు.ఇప్పటికే ‘3.O’ వెర్షన్‌కు సంబంధించిన కథను రెడీ చేయించేపనిలో ఉన్నాడు శంకర్.

రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన 2.O


ప్రస్తుతం శంకర్..కమల్ హాసన్‌తో ‘భారతీయుడు2’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ నెల 14 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో కమల్ హాసన్‌తో పాటు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, శింబు ముఖ్యపాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది.ఇండియన్ 2 పోస్టర్


‘భారతీయుడు2’ మూవీ తర్వాత శంకర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీతో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్‌తో శంకర్ తెరకెక్కించిన ‘ఒకే ఒక్కడు’ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచనలో శంకర్ ఉన్నట్టు సమాచారం. ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. ఈ మూవీని హిందీలో అనిల్ కపూర్ హీరోగా ‘నాయక్’ గా శంకర్ రీమేక్ చేసాడు.

విజయ్‌తో ఒకే ఒక్కడు సీక్వెల్‌ను ప్లాన్ చేసిన శంకర్
బాలీవుడ్‌లో కూడా ఓ మోస్తరుగా నడిచింది. ఇపుడీ మూవీకి సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. ఈ రీమేక్‌లో విజయ్ హీరోగా నటించే అవకాశం ఉంది. మొత్తానికి శంకర్..కొత్త స్టోరీలతో కుస్తీ పట్టడం కన్నా...పాత స్టోరీలతో సీక్వెల్‌ తీసే పనిలో పడ్డాడని అందరు చెప్పుకుంటున్నారు.


ఇది కూడా చదవండి 

ఎన్టీఆర్ ‘మ‌హానాయ‌కుడు’ క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతుందో తెలుసా..?

2.0’ ఫస్ట్ వీక్ క‌లెక్ష‌న్స్.. నైజాంలో నాన్ బాహుబ‌లి రికార్డ్..

రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసిన రజినీకాంత్ ‘2.O’

First published: December 6, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>