హోమ్ /వార్తలు /సినిమా /

SP బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై శంకర్ మహదేవన్ వీడియో..

SP బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై శంకర్ మహదేవన్ వీడియో..

శంకర్ మహదేవన్ ఎస్పీ బాలు (shankar mahadevan sp balu)

శంకర్ మహదేవన్ ఎస్పీ బాలు (shankar mahadevan sp balu)

SP Balasubramaniam: భారతదేశంలోని సంగీత ప్రియులంతా ఇప్పుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలుకు ఏమీ కాకూడదని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఆగస్ట్ 5న కరోనా బారిన..

భారతదేశంలోని సంగీత ప్రియులంతా ఇప్పుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలుకు ఏమీ కాకూడదని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఆగస్ట్ 5న కరోనా బారిన పడిన ఈయన.. ప్రస్తుతం చెన్నై ఎంజిఎం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగానే ఉంది. దాంతో సినీ ప్రముఖులు అంతా ఎస్పీబి బాగుండాలని కోరుకుంటున్నారు. ఆయన మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని.. ఆయన గాత్రం మళ్లీ వినాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు శంకర్ మహదేవన్ కూడా వీడియో విడుదల చేసాడు.


లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని దేవున్ని మనసారా ప్రార్థిస్తున్నాను.. దేశంలోని సంగీత ప్రియులంతా మీకోసమే చూస్తున్నారంటూ శంకర్ మహదేవన్ వీడియోలో తెలిపాడు. అందరి ప్రార్థనలతో ఆయన మళ్లీ వస్తారని.. వచ్చి తన గాత్రాన్ని వినిపిస్తారని ఆశిస్తున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు శంకర్ మహదేవన్. ఎంజిఎం ఆస్పత్రి వైద్యులు ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. లైఫ్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అందరి ప్రార్థనలు ఫలించి బాలు మళ్లీ తిరిగి వస్తారని ఆశిద్ధాం.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: SP Balasubrahmanyam, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు