శంకర్ కోసం

శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ సినిమా అప్పట్లో భారీ సక్సెస్‌ను నమోదు చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ‘ఐతే ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్  కానుకగా మేలో ‘ఇండియన్2’ విడుదల చేసేలా శంకర్ ప్లాన్ చేసినట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: January 15, 2019, 1:07 PM IST
శంకర్ కోసం
శంకర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ సినిమా అప్పట్లో భారీ సక్సెస్‌ను నమోదు చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ‘భారతీయుడు2’ విడుదలైన 22 యేళ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్‌లు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఇండియన్2’ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ జనవరి 18న పొలాచ్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ తర్వాత చెన్నై, యూరప్‌లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఐతే ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్  కానుకగా మేలో ‘ఇండియన్2’ విడుదల చేసేలా శంకర్ ప్లాన్ చేసినట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

Kamal Haasan, Shankar’s Bharatheeyudu2 Starts From january 18
’భారతీయుడు2’గా కమల్ హాసన్


శంకర్ గత చిత్రాలను చూస్తే...ఈ సినిమాను తీసుకున్న ఏళ్లకు చెక్కడం అలవాటైపోయింది. రీసంట్‌గా రిలీజైన రజినీకాంత్, అక్షయ్ కుమార్‌ల ‘2.O’ సినిమాను పూర్తి చేయడానికి దాదాపు మూడేళ్ల టైమ్ తీసుకున్నాడు. అందుకే ఇపుడు కమల్ హాసన్‌తో చేయబోయే ‘ఇండియన్2’ సినిమాలో ఎక్కువ గ్రాఫిక్స్ లేకుండా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైన ఈ సినిమా షూటిగ్... ఈ నెల 18నుంచి చక చకా కానిచ్చే పనిలో ఉన్నాడు శంకర్.

భారతీయుడు‌గా కమల్ హాసన్


‘ఇండియన్2’ సినిమాను సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్ భారీ ఎత్తున తెరకెక్కించనున్న ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, శింబులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నారు.

కమల్ హాసన్, శంకర్
మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ లేదా అక్షయ్ కుమార్ ‘ఇండియన్2’లో  నెగిటివ్ రోల్లో నటించనున్నారనే సమాచారం కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ‘భారతీయుడు2’ కమల్ హాసన్ సినిమాలకు పుల్‌స్టాప్ ఇచ్చిన తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తారట. అందుకే ఈసినిమాను తొందరగా షూటింగ్ కానిచ్చే పనిలో పడ్డాడు శంకర్. ఈ సినిమా తర్వాత శంకర్..హృతిక్ రోషన్‌తో బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం.

 

పొలిటికల్ సినిమా...క్యూ కడుతోన్న మోదీ,ఎన్టీఆర్, జయలలిత బయోపిక్స్
ఇవి కూడా చదవండి 

‘ఎన్టీఆర్ కథానాయకుడు’కి నో కట్స్..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ లేడా..?

వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ..త్వరలో పట్టాలెక్కనున్న సినిమా

 
First published: January 4, 2019, 6:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading