ఇండియన్ 2కు కొబ్బరికాయ కొట్టిన కమల్ హాసన్

శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌ను ఈ సోమవారం  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ మూవీలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది.

news18-telugu
Updated: November 13, 2018, 8:47 AM IST
ఇండియన్ 2కు కొబ్బరికాయ కొట్టిన కమల్ హాసన్
’భారతీయుడు2’గా కమల్ హాసన్
  • Share this:
శంకర్ దర్శత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ మూవీని తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో డబ్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైయింది. ఈ మూవీ విడుదలైన 22 యేళ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్‌లు ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఇండియన్2’ చేస్తున్నారు.

‘భారతీయుడు’ లో తండ్రీ కొడుకులుగా కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. అవినీతి, లంచగొండి తనానికి వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. ఈ మూవీలో కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్‌ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్. ఈ మూవీలో నటనకు గాను కమల్ హాసన్..మూడోసారి జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈ మూవీకి ఏ.ఆర్.రహమాన్ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది.

భారతీయుడు పూజా కార్యక్రమం


తాజాగా ఈ మూవీ సీక్వెల్‌ను ఈ సోమవారం  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సీక్వెల్‌లో కమల్ హాసన్ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈ మూవీని ఇప్పటి సమకాలీన రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది. లైకా ప్రొడక్షన్ భారీ ఎత్తున తెరకెక్కించనున్న ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఇండియన్ 2 దుల్కర్ సల్మాన్


మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ఈ మూవీలో నెగిటివ్ రోల్లో నటిస్తారనే సమాచారం కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక ‘భారతీయుడు’ లో సీబీఐ ఆఫీసర్ పాత్రను పోషించిన నెడుముడి వేణు ఈ మూవీలో మరోసారి సీబీఐ ఆఫీసర్ పాత్రను పోషించనున్నారు. తొందర్లనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారట. అప్పట్లో ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచిన ‘భారతీయడు’లాగానే ఈ  సీక్వెల్ కూడా సంచలనాలకు వేదికగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 13, 2018, 8:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading