శంకర్@25

‘జెంటిల్‌మెన్’ మూవీతో ప్రారంభమైన శంకర్ సినీ ప్రస్థానం ఇరవై ఐదేళ్లు పూర్తైయిన సందర్భంగా ఆయన శిష్యులు ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్స్ చేసుకున్నారు.

‘జెంటిల్‌మెన్’ మూవీతో ప్రారంభమైన శంకర్ సినీ ప్రస్థానం ఇరవై ఐదేళ్లు పూర్తైయిన సందర్భంగా ఆయన శిష్యులు ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్స్ చేసుకున్నారు.

‘జెంటిల్‌మెన్’ మూవీతో ప్రారంభమైన శంకర్ సినీ ప్రస్థానం ఇరవై ఐదేళ్లు పూర్తైయిన సందర్భంగా ఆయన శిష్యులు ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్స్ చేసుకున్నారు.

  సామాజిక సమస్యలే శంకర్ సినిమాలకు ప్రధాన కథా వస్తువులు. సోషల్ ప్రాబ్లెమ్స్‌కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు ఇండియన్ మూవీ మేకింగ్ స్టైల్ మార్చిన గ్రేట్ డైరెక్టర్. శంకర్ తీసే సినిమాల్లో భారతీయత, దేశభక్తి అడుగడున కనిపిస్తాయి.

  యాక్షన్ కింగ్ అర్జున్‌తో తెరకెక్కించిన ‘జెంటిల్‌మెన్’ చిత్రంలో కెరీర్‌ను ప్రారంభించిన శంకర్..ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా అవినీతి, లంచగొండితనంపై శంకర్ రూపొందించిన సినిమాలు ఆయనకు ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చాయి. ‘జెంటిల్‌మెన్’ మూవీతో ప్రారంభమైన శంకర్ సినీ ప్రస్థానం  ఇరవై ఐదేళ్లు పూర్తైయిన సందర్భంగా ఆయన శిష్యులు ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్స్ చేసుకున్నారు.

  ఈ ఇరవై ఐదేళ్ల ప్రస్థానంలో శంకర్...‘ప్రేమికుడు’, ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘శివాజీ’, ‘రోబో’ వంటి విభిన్న కథా చిత్రాలతో ఆడియన్స్ మనసు దోచుకున్నాడు. ఇపుడు మరోసారి రజినీకాంత్, అక్షయ్ కుమార్‌లతో  రోబో సీక్వెల్ ‘2.0’ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు2’ మూవీని తెరకెక్కించే పనిలో వున్నాడు శంకర్.

  దర్శకుడుగా సిల్వర్ జూబ్లీ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆయన శిష్యులు మాదేష్, బాలాజీ శక్తివేల్, వసంతబాలన్, అరివళగన్, అట్లితో పాటు పలువురు కలిసి శంకర్‌కు ఓ జ్ఞాపికను అందించి శుభాకాంక్షలు తెలియచేశారు. మరోవైపు శంకర్ నా దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన వారి ప్రేమకు తడిసి ముద్దయ్యాను. వాళ్లు లేకుండా నా ప్రయాణం సాఫీగా జరిగేది కాదన్నారు. 25 ఏళ్ల కెరీర్‌లో శంకర్...తమిళంలో 11 సినిమాలు, హిందీలో ఒక సినిమాకు దర్శకత్వం వహించారు.

  First published:

  Tags: Kollywood News, Tamil Film News

  ఉత్తమ కథలు