Home /News /movies /

SHAKEELA RUBBISHES RUMOURS OF HER ILL HEALTH AND DEATH NR

Actress Shakeela: నేను ఇంకా చచ్చిపోలేదు.. బ్రతికే ఉన్న.. ఫేక్ వార్తలపై షేకిలా షాకింగ్ కామెంట్స్!

Shakeela

Shakeela

Actress Shakeela: బోల్డ్ నటి షకీలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి శృంగార తారగా పేరు తెచ్చుకుంది. 18 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

    Actress Shakeela: బోల్డ్ నటి షకీలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి శృంగార తారగా పేరు తెచ్చుకుంది. 18 ఏళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళం భాషలలో దాదాపు వందకు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

    ఇక ఇప్పటి వరకు తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల కొన్ని సంబంధాలు ఉన్నాయని చాలాసార్లు పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలిపింది షకీలా. ఇక కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఇదిలా ఉంటే తాజాగా తనపై తప్పుడు వార్తలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది.

    ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండేసరికి ప్రతి ఒక్క విషయం క్షణాల్లో వైరల్ గా మారుతుంటుంది. ఇక సెలబ్రెటీల విషయంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది సెలబ్రిటీల గురించి కొన్ని పుకార్లను, వాళ్ళ వ్యక్తిగత విషయాలను బాగా బయట పెడుతుంటారు. ఇక మరికొందరు బతికుండగానే ఇక లేరు అంటూ కొందరి సెలబ్రెటీల ఫోటోలకి దండలు వేస్తుంటారు. ఇలా ఏదో ఒక తప్పుడు వార్తలతో సెలబ్రెటీలను మీడియా ముందుకు లాగుతుంటారు. ఇక షకీలా విషయంలో కూడా అదే జరిగింది.



    కొన్ని రోజుల నుండి షకీలా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. ఆమె ఇక లేరు అంటూ కొన్ని పుకార్లు సృష్టించారు. దీంతో ఈ పుకారు నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ విషయం షకీలా వరకు చేరగా తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తను మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం అని.. గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని..చాలా ఆరోగ్యంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. తను చనిపోయిందంటూ పుకార్లు వచ్చాయని తెలిపింది. ఇక ఈ వార్తలను నమ్మొద్దని ఈ ఫేక్ వార్తను చూసిన తన అభిమానులు తనకు ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారని తెలిపింది. ఇక వారు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు చెప్పుకుంది. అంతేకాకుండా తప్పుడు వార్తలు చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ.. వారివల్లే అందరూ తన వైపు చూశారని స్పందించింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Actress shakeela, Bollywood, Celebrity, Death rumours, Rumours, Tamil actress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు