• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SHAKEELA FELL IN LOVE ONE MORE TIME HERE ARE THE DETAILS SR

Shakeela : పదమూడు సంవత్సరాల చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా..

Shakeela : పదమూడు సంవత్సరాల చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా..

Shakeela Photo : Twitter

Shakeela: షకీలా గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. షకీలా శృంగార తారగా చాలా పాపులర్. ఒకానొక స‌మ‌యంలో తన సినిమాలతో స్టార్ హీరోలకు చుక్కలు చూపించింది.

  • Share this:
    Shakeela: షకీలా గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. షకీలా శృంగార తారగా చాలా పాపులర్. ఒకానొక స‌మ‌యంలో తన సినిమాలతో స్టార్ హీరోలకు చుక్కలు చూపించింది. షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. షకీలా అంత‌లా క్రేజ్‌ను సంపాదించుకున్నారు. స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీ దక్కించుకున్న షకీలా అభిమానుల చేత గుడులు కట్టించుకొని పూజలు కూడా చేయించుకున్నారు. అయితే కొన్నాళ్లుకు ఆమె సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో ఆ త‌రువాత ఉన్న‌ట్లుండి ఢీలా ప‌డిపోయారు షికీలా. ఇక ఆ త‌రువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు ష‌కీలా. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.  షకీలా దాదాపు 250 పైగా చిత్రాల్లో హీరోయిన్ నటించారు. తెలుగులో ఈమె ‘జయం, తొట్టి గ్యాంగ్, నాగ, పుట్టింటికి రా చెల్లి, దొంగోడు, బంగారం, కరెంట్, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈమె ఎక్కువగా పాపులర్ అయింది మాత్రం మలయాళ చిత్ర సీమలోనే అని చెప్పాలి.

    ఇక ఆ మధ్య ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రిచా చడ్డా ప్రధాన పాత్రలో నటించింది. రిచా చడ్డా హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ అనే సినిమాలో నటించి సూపర్ పాపులర్ అయ్యింది. షకీలా జీవితం ఆధారంగా వచ్చిన సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో రిచా చద్దాతో పాటు పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై కీలక పాత్రల్లో నటించారు. ద‌ర్శ‌కుడు ఇంద్ర‌జిత్. అది అలా ఉంటే ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షకీలా.. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం వెల్లడించింది.

    షకీలా బయోపిక్ పోస్టర్


    ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఒకరితో ప్రేమలో ఉన్నాను. నా వయస్సు ఇప్పుడు 43 ఏళ్లు. ఈ వయస్సులో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అయితే నా బాయ్ ఫ్రెండ్ నాకన్నా చిన్నోడు. ఆయన వయస్సు 30 సంవత్సరాలు. ఈ రోజుల్లో ఏజ్‌ అనేది జస్ట్‌ నెంబర్‌ మాత్రమే. అంతేకాదు నేను పెళ్లైన వ్యక్తితో లవ్‌లో లేను కదా.. అతని ఫ్యామిలీని  డిస్ట్రబ్ చేయడానికి అంటూ.. ఇందులో తప్పేం ఉంది అని తెలిపింది. ఇంకా మాట్లాడుతూ తనకు గతంలోనూ చాలా మంది బాయ్‌ ప్రెండ్స్‌ ఉండేవారని.. అయితే వాళ్లు ఏవో రీజన్స్‌తో తన జీవితంలోంచి ఒక్కొక్కరిగా వదిలేసి వెళ్లిపోయారని తెలిపింది.
    Published by:Suresh Rachamalla
    First published: