HOME » NEWS » movies » SHAKEELA BIOPIC READY TO RELEASE AND THE DARK STORIES OF THOSE HEROES WILL EXPOSED IN MOVIE PK

Shakeela Biopic: ‘షకీలా’ బయోపిక్‌లో ఆ హీరోల చీకటి భాగోతం బయట పడబోతుందా..?

Shakeela Biopic: ఇప్పుడు ఇండ‌స్ట్రీల‌తో ప‌ని లేదు.. అన్నిచోట్లా కూడా బ‌యోపిక్స్ సంద‌డి న‌డుస్తుంది. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఇది వ‌ర‌కు బ‌యోపిక్ చేయాలంటే వాళ్లేదైనా జీవితంలో గొప్ప‌ది సాధించాలి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 1, 2020, 5:51 PM IST
Shakeela Biopic: ‘షకీలా’ బయోపిక్‌లో ఆ హీరోల చీకటి భాగోతం బయట పడబోతుందా..?
షకీలా పోస్టర్ (Shakeela movie poster)
  • Share this:
ఇప్పుడు ఇండ‌స్ట్రీల‌తో ప‌ని లేదు.. అన్నిచోట్లా కూడా బ‌యోపిక్స్ సంద‌డి న‌డుస్తుంది. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఇది వ‌ర‌కు బ‌యోపిక్ చేయాలంటే వాళ్లేదైనా జీవితంలో గొప్ప‌ది సాధించాలి అనుకునేవాళ్లు.. అలాంటి బ‌యోపిక్స్ ఆద‌ర్శంగా ఉంటాయ‌ని చేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు.. డాన్స్, రాజ‌కీయ నాయ‌కులు, మాఫియా లీడ‌ర్స్, హీరోయిన్లు.. ఇలా ఎవ‌రి బ‌యోపిక్ కావాలంటే వాళ్ల‌ది చేస్తున్నారు. జ‌స్ట్.. వాళ్ల జీవితంలో వివాదం ఉంటే చాలు. ఇప్పుడు అదే దారిలో వ‌స్తున్న మ‌రో బ‌యోపిక్ ష‌కీలా. 20 ఏళ్ల కింది వ‌ర‌కు ఈమె పోస్ట‌ర్ క‌నిపించింది అంటే మాత్రం థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేవి. భాష‌తో ప‌నిలేకుండా అన్ని చోట్లా ష‌కీలా సినిమాలు సంచ‌నాలు సృష్టించేవి. ముఖ్యంగా మ‌ళ‌యాలంలో అయితే ఈమె సినిమాలు బ్యాన్ చేయాల‌ని స్టార్ హీరోలు సైతం ధ‌ర్నాలు చేసారంటే అప్ప‌ట్లో ఈమె క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఈమె బ‌యోపిక్ వ‌స్తుంది.. ఈ చిత్రంలో రిచా చ‌డ్డా హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Sensational Shakeela Biopic Poster raises expectations on movie.. ఇప్పుడు ఇండ‌స్ట్రీల‌తో ప‌నిలేదు.. అన్నిచోట్లా కూడా బ‌యోపిక్స్ సంద‌డి న‌డుస్తుంది. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఇప్పుడు అదే దారిలో వ‌స్తున్న మ‌రో బ‌యోపిక్ ష‌కీలా. 20 ఏళ్ల కింది వ‌ర‌కు ఈమె పోస్ట‌ర్ క‌నిపించింది అంటే మాత్రం థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేవి. భాష‌తో ప‌నిలేకుండా అన్ని చోట్లా ష‌కీలా సినిమాలు సంచ‌నాలు సృష్టించేవి. ఇంద్రజిత్ లంకేశ్ దీనికి దర్శకుడు. shakeela biopic,shakeela biopic release date,shakeela biopic poster,shakeela movie,shakeela richa chadha,shakeela movie biopic richa chadha,richa chadha hot photos,telugu cinema,shakeela biopic indrajit lankesh,షకీలా బయోపిక్,షకీలా బయోపిక్ ఇంద్రజిత్ లంకేష్,షకీలా బయోపిక్ రిచా చడ్డా,షకీలా బయోపిక్ పోస్టర్,షకీలా బయోపిక్ పోస్టర్ విడుదల,షకీలా రిచా చడ్డా,షకీలా బయోపిక్ రిలీజ్ డేట్, తెలుగు సినిమా
షకీలా బయోపిక్ పోస్టర్


బ‌యోపిక్ అంటే కేవ‌లం అడ‌ల్ట్ స్టార్‌గా కాకుండా.. అస‌లు ఆమె ఎందుకు ఆ ఫీల్డ్‌లోకి రావాల్సి వ‌చ్చిందనేది ఆస‌క్తిక‌రంగా చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ష‌కీలా ప‌డిన బాధ‌లేంటి అనేవి అన్నీ పొందుప‌రుస్తూ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ఇంద్రజిత్ లంకేశ్ షకీలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్త‌యింది. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. షకీలా జీవితం తెరిచిన పుస్త‌కం.

Sensational Shakeela Biopic Poster raises expectations on movie.. ఇప్పుడు ఇండ‌స్ట్రీల‌తో ప‌నిలేదు.. అన్నిచోట్లా కూడా బ‌యోపిక్స్ సంద‌డి న‌డుస్తుంది. ఎవ‌రి బ‌యోపిక్ ప‌డితే వాళ్ల బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఇప్పుడు అదే దారిలో వ‌స్తున్న మ‌రో బ‌యోపిక్ ష‌కీలా. 20 ఏళ్ల కింది వ‌ర‌కు ఈమె పోస్ట‌ర్ క‌నిపించింది అంటే మాత్రం థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేవి. భాష‌తో ప‌నిలేకుండా అన్ని చోట్లా ష‌కీలా సినిమాలు సంచ‌నాలు సృష్టించేవి. ఇంద్రజిత్ లంకేశ్ దీనికి దర్శకుడు. shakeela biopic,shakeela biopic release date,shakeela biopic poster,shakeela movie,shakeela richa chadha,shakeela movie biopic richa chadha,richa chadha hot photos,telugu cinema,shakeela biopic indrajit lankesh,షకీలా బయోపిక్,షకీలా బయోపిక్ ఇంద్రజిత్ లంకేష్,షకీలా బయోపిక్ రిచా చడ్డా,షకీలా బయోపిక్ పోస్టర్,షకీలా బయోపిక్ పోస్టర్ విడుదల,షకీలా రిచా చడ్డా,షకీలా బయోపిక్ రిలీజ్ డేట్, తెలుగు సినిమా
షకీలా బయోపిక్ పోస్టర్


ఆమె త‌న బుక్‌లో కూడా అన్ని విష‌యాల‌ను చాలా క్లారిటీగా రాసుకుంది. ఇప్పుడు ఇదే సినిమాలో చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌జిత్. అప్పట్లో విడుదలైన ఫస్ట్ లుక్ పిచ్చెక్కించింది. లిక్క‌ర్ గ్లాసులో బ్లాక్ నిక్కర్.. ఎల్లో కలర్ టాప్ వేసుకొని మత్తెక్కించే చూపులతో కట్టిపడేసేలా చూస్తుంది రిచా చ‌ద్దా. స‌రిగ్గా 9 ఏళ్ల కింద విద్యాబాల‌న్ న‌టించిన డ‌ర్టీ పిక్చ‌ర్ ఇంకా ప్రేక్ష‌కులు మ‌రిచిపోలేదు. ఇప్పుడు మ‌రోసారి అలాంటి సెన్సేష‌న‌ల్ స్టార్ బ‌యోపిక్ వ‌స్తుంది.

షకీలా బయోపిక్ పోస్టర్


అంతేకాదు ష‌కీలా బ‌యోపిక్‌లో చాలా మంది హీరోల చీకటి భాగోతాలను కూడా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. కేరళలో రెండుసార్లు షకీలాపై హత్యాయత్నం జరిగింది. ఆ జరిపించింది అక్కడి హీరోలే అనే టాక్ కూడా ఉంది. ఈ బయోపిక్‌లో వాటి గురించి కూడా చూపించబోతున్నాడు దర్శకుడు ఇంద్రజీత్. ఈ చిత్రంలో షకీలా పాత్రలో రిచా చద్దా నటిస్తుంటే.. పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: December 1, 2020, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading