షారుఖ్, సల్మాన్, దీపికాలతో భన్సాలీ భారీ మల్టీస్టారర్ ?

ఈ యేడాది ‘పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ...తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా ఒక చారిత్రక కథాంశాన్నే ఎంచుకున్నాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్, సల్మాన్‌లతో పాటు దీపికా పదుకొణేలు ముఖ్యపాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: November 26, 2018, 11:11 AM IST
షారుఖ్, సల్మాన్, దీపికాలతో భన్సాలీ భారీ మల్టీస్టారర్ ?
షారుఖ్, సల్మాన్, దీపికా
  • Share this:
బాలీవుడ్‌లో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. అలాగే బీటౌన్‌లో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీది డిఫరెంట్ స్టైల్. ముఖ్యంగా చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో భన్సాలీకి తిరుగులేదని ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాలతో నిరూపించుకున్నాడు. మరోవైపు భన్సాలీ తెరకెక్కించిన చిత్రాల్లో చరిత్రను వక్రీకరించారని కొంత మంది వాదన. వాటి సంగతి పక్కన పెడితే వెండితెరపై ఆయన తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక్కో దృశ్యకావ్యంగా నిలిచిపోయాయి.

ఈ యేడాది ‘పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ...తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా ఒక చారిత్రక కథాంశాన్నే ఎంచుకున్నాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.

పద్మావత్ మూవీ


ఈ మూవీలో బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్, సల్మాన్‌లతో పాటు దీపికా పదుకొణేలు ముఖ్యపాత్రల్లో నటించబోతున్నట్టు సమాచారం. ఒక వేళ దీపికా ఈ మూవీలో నటించడం ఖాయం అయితే...పెళ్లికి ముందు తర్వాత దీపికా నటించబోయే సినిమా భన్సాలీ దే  అవుతోంది.

జీరో‌లో సల్మాన్ ఖాన్‌తో షారుక్


మరోవైపు సంజయ్ లీలా భన్సాలీ...షారుఖ్, సల్మాన్‌లతో 1990లో వచ్చిన ‘సౌదాఘర్’ మూవీని రీమేక్ చేయనున్నట్టు అనే వార్త ఆ మధ్య షికారు చేసింది. ఇంకోవైపు భన్సాలీ..ప్రియాంక చోప్రాతో ముంబాయికి చెందిన రౌడీరాణి గంగూబాయి కోఠేవాలి జీవిత కథ ఆధారంగా ‘హీరా మండి’ మూవీని తెరకెక్కించనున్నట్టు వార్తలు వెలుబడినుండే. మొత్తానికి సంజయ్ లీలా భన్సాలీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ఏమిటనేది బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఈ విషయమైన భన్సాలీ నుంచి అధికార ప్రకటన వెలుబడేంత వరకు ఈ రూమర్లకు చెక్ పడేలా లేవు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 26, 2018, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading