సినిమాలు లేకనే షారుఖ్ ఇలా చేసాడా.. వైరల్ అవుతున్న వీడియో..

పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. తాజాగా షారుఖ్ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఒక వీడియో రిలీజ్ చేసాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 22, 2019, 4:57 PM IST
సినిమాలు లేకనే షారుఖ్ ఇలా చేసాడా.. వైరల్ అవుతున్న వీడియో..
షారుఖ్ ఖాన్..ఫైల్ ఫోటో
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 22, 2019, 4:57 PM IST
పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు. ఇప్పుడు షారుక్ ఖాన్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. షారుక్ పేరుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ రికార్డులు తిర‌గ‌రాయ‌డానికి ఈ ఒక్క పేరు చాలు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డుల‌తో చెడుగుడు ఆడుకున్న కింగ్ ఖాన్.. ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఈయ‌న సినిమాలు కొన్నేళ్లుగా స‌రిగ్గా ఆడ‌టం లేదు. క‌నీసం 100 కోట్లు వ‌సూలు చేయ‌డానికి కూడా ఇబ్బంది ప‌డే స్థాయికి వ‌చ్చేసాయి. 5 ఏళ్ల కింద "చెన్నై ఎక్స్‌ప్రెస్" సినిమాతో బాలీవుడ్‌లో తొలిసారి 400 కోట్ల మార్క్ అందుకున్న షారుక్.. ఆ త‌ర్వాత స్థాయికి త‌గ్గ విజ‌యం కోసం తంటాలు ప‌డుతూనే ఉన్నాడు.ఇక లాస్ట్ ఇయర్ ఎండ్‌లో విడుదలైన ‘జీరో’తో నిజంగానే జీరో అనిపించుకున్నాడు. దీంతో నెక్ట్స్ సినిమా ఏది చేయాలనే దానిపై షారుఖ్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటి వరకు ఏ సినిమా ఓకే చేయలేదు.

తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ సెలబ్రిటీలు ఓటింగ్ పెరిగేలా ప్రజలను ప్రోత్సహించాలిని ట్విట్టర్ వేదికగా వేడుకున్నారు. మోదీ ట్వీట్‌కు స్పందిస్తూ పలువురు ఓటేయాలంటే క్యాంపెయినింగ్ కూడా చేసారు. ఇక ప్రధాని మోదీ పిలుపునిచ్చిన చాలా రోజుల తర్వాత షారుఖ్ తనదైన శైలిలో స్పందించారు. సరిగ్గా మహారాష్ట్ర ముంబాయిలో ఈ నెల 29న జరిగే నాల్గో విడత జరగనున్న  ఎన్నికల్లో భాగంగా అందరు ఓటేయాలని ఓ పాట రూపంలో పిలుపునిచ్చారు. ఈ మంగళవారం మహారాష్ట్ర మూడో విడత పోలింగ్ జరగనుంది. ఈ పాటను షారుఖ్ స్వయంగా పాడటం విశేషం. అంతేకాదు మన ఓటుతోనే మన దేశ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు. అందుకే అందరు కలిసి ఈ ప్రజాస్వామ్య క్రతువులో భాగం కావాలంటూ పిలుపునిచ్చాడు.

First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...