హాలీవుడ్ సినిమాకు తండ్రి కొడుకులు..కుమారుడుతో అదరగొట్టనున్న సూపర్ స్టార్

The Lion King: ది లయన్ కింగ్.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం యానిమేషన్‌గా వచ్చిన డిస్నీ కామిక్..అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు 3D వర్షెన్ వస్తోంది. ఈ సినిమాకు హిందీ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, ఆయన ముద్దుల కుమారుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పనున్నారు.

news18-telugu
Updated: June 18, 2019, 12:46 PM IST
హాలీవుడ్ సినిమాకు తండ్రి కొడుకులు..కుమారుడుతో అదరగొట్టనున్న సూపర్ స్టార్
The Lion King పోస్టర్స్ Photo: Twitter.com/disneylionking
  • Share this:
The Lion King: ది లయన్ కింగ్.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం యానిమేషన్‌గా వచ్చిన డిస్నీ కామిక్..అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో క్రూర మృగాలు మనషుల్లా మాట్లాడతూ..మనలాగే ప్రవర్తిస్తాయి. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసి మెలిసి బతుకుతాయి. వీటికి ఓ రాజు, ఓ రాణి, ఓ యువరాజు ఉంటారు. అంతేకాదు జంతువు కనిపిస్తే చాలు వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. అయితే ఇదంతా డిస్నీ తయారు చేసిన ఓ కల్పిత కథ. దీని పేరే 'ది లయన్‌ కింగ్‌'. ఈ లయన్ కింగ్‌ సినిమాలో హీరో 'సింబ'. చిన్నప్పుడే సింబ ఓ యాక్సిడెంట్‌ కారణంగా.. కుటుంబం నుండి పారిపోతాడు. తన కుంటుంబానికి దూరంగా.. టిమోన్‌ అనే ముంగిస, పుంబా అనే అడివి పందితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అయితే కొన్ని సంవత్సరాల తన గతం గుర్తుకురావడం, తర్వాత తన రాజ్యాన్ని ఎలా తిరిగి దక్కించుకున్నాడనేది కథ. అయితే 1990లో ఈ సినిమాను 2డి యానిమేటెడ్‌ సినిమాగా విడుదల చేశారు.

దీన్ని మరోసారి..ఆధునిక సాంకేతిక సహాయంతో 3డిలో వచ్చే నెల జూలై 19న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు షారుక్‌ ఖాన్‌ డబ్బింగ్ చెబుతున్నారు. ఈ సినిమాలోని ముఫాసా (సింబా తండ్రి) క్యారెక్టర్‌కు షారుక్ డబ్బింగ్ చెబుతుండగా..ఈ సినిమాకు హీరో సింబా క్యారెక్టర్‌కు షారుక్ తనయుుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది.


 
View this post on Instagram
 

Ready for the match with the spirit of #FathersDay. Go India Go!!


A post shared by Shah Rukh Khan (@iamsrk) on


First published: June 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు