సంచలన బయోపిక్‌లో షాహిద్ కపూర్..!

ఈ మూవీ తర్వాత శ్రీనారాయణ్ సింగ్..శ్వేత విప్లవంతో దేశంలో పాల దిగుబడిని పెంచిన వర్గీస్ కురియన్ జీవితంగా ఆధారంగా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో ఈ మూవీని అక్షయ్ కుమార్‌తో తెరకెక్కిద్దామనుకున్నాడు.

news18-telugu
Updated: September 11, 2018, 3:56 PM IST
సంచలన బయోపిక్‌లో షాహిద్ కపూర్..!
షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో సినీ, రాజకీయ, స్పోర్ట్స్ అంటూ ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వాళ్ల జీవితాలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు అక్కడి మూవీ మేకర్స్.

ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు శ్రీ నారాయణ్ సింగ్ ..స్వచ్ఛ్ భారత్ నేపథ్యంలో తెరకెక్కించిన ‘టాయిలెట్..ఏక్ ప్రేమ్‌కథ’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా ఘన విజయాన్ని అందుకుంది. ఇపుడీ దర్శకుడు షాహిద్ కపూర్, శ్రద్ధాకపూర్‌లు హీరో, హీరోయిన్లుగా ‘బత్తి గుల్ మీటర్ చాలు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీని దేశంలోని విద్యుత్ సమస్యల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో ఇటువంటి తరహా కథను ఎవ్వరు తెరకెక్కించలేదట. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ మూవీ తర్వాత శ్రీనారాయణ్ సింగ్..శ్వేత విప్లవంతో దేశంలో పాల దిగుబడిని పెంచిన వర్గీస్ కురియన్ జీవితంగా ఆధారంగా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో ఈ మూవీని అక్షయ్ కుమార్‌తో తెరకెక్కిద్దామనుకున్నాడు. ప్రస్తుతం అక్షయ్ వరుస సినిమాలతో బిజీ ఉండటంతో ఈ కథను షాహిద్‌తో తెరకెక్కిద్దామనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ బయోపిక్‌లో యాక్ట్ చేయడానికి దర్శకుడికి షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. క్షీర విప్లవ పితామహుడిగా పేరొందినవర్గీస్ కురియన్ పాత్రలో షాహిద్ ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.
First published: September 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>