హిందీలో ’కబీర్ సింగ్’ గా వస్తోన్న అర్జున్ రెడ్డి

బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ఈ మూవీని హిందీలో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ హిందీ వెర్షన్‌కు ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ఖరారు చేశారు.

news18-telugu
Updated: October 26, 2018, 11:06 AM IST
హిందీలో ’కబీర్ సింగ్’ గా వస్తోన్న అర్జున్ రెడ్డి
కబీర్ సింగ్‌గా వస్తోన్న షాహిద్
  • Share this:
విజయ్ దేవరకొండ హీరోగా...సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. షాలినీ పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు.

తెలుగులో హిట్టైన ఈ మూవీని అన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్..‘వర్మ’ టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే విడులైన ‘వర్మ’ ఫస్ట్ ‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు కన్నడ,మలయాళ వెర్షన్‌లో ఈ మూవీని రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలైనాయి.

ఇంకోవైపు బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ఈ మూవీని హిందీలో తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే యేడాది జూన్ 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్‌కు ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఈ మూవీలో షాహిద్ కపూర్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో ‘ప్రేమికుడు’ సినిమాలో ఉన్న ఊర్వశి పాటను రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ రీమిక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ లాగా హిందీలో కబీర్ సింగ్ గా షాహిద్ కపూర్ ఆడియన్స్‌ను ఏ మేరకు అట్రాక్ట్ చేస్తాడో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 26, 2018, 11:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading