300 మంది ఆడాళ్లతో గడిపానని చెబితే మీకు నచ్చింది .. నా సినిమాపైనే ఎందుకిలా :షాహిద్ కపూర్

విజయ్ దేవరకొండను తెలుగులో ఓవర్ నైట్ సెన్సేషనల్ స్టార్‌ను చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి సంచలనం నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేకైన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా పై వస్తోన్న ట్రోలింగ్స్‌కు గట్టి సమాధానం ఇచ్చాడు.

news18-telugu
Updated: July 26, 2019, 4:26 PM IST
300 మంది ఆడాళ్లతో గడిపానని చెబితే మీకు నచ్చింది .. నా సినిమాపైనే ఎందుకిలా :షాహిద్ కపూర్
‘కబీర్ సింగ్’ షాహిద్ కపూర్
news18-telugu
Updated: July 26, 2019, 4:26 PM IST
విజయ్ దేవరకొండను తెలుగులో ఓవర్ నైట్ సెన్సేషనల్ స్టార్‌ను చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి సంచలనం నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేకైన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరో, కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ చిత్రంతో షాహిద్,కియారా లను బాలీవుడ్లో సెన్సషనల్ స్టార్స్ అయ్యారు.ఇంత పెద్ద హిట్టైయిన ఈ సినిమాకు అదే స్థాయిలో ట్రోలింగ్‌కు గురవైతుంది. ట్రోలింగ్ కల్చర్ విపరీతంగా ఉండే బాలీవుడ్ లో `కబీర్ సింగ్`ను వివాదాలు వెంటాడాయి. ఈ చిత్రం లోని కొన్ని సన్నివేశాలలో హీరో హీరోయిన్ పై చెయ్యిచేసుకోవడం, హీరో ఆడాళ్లతో దురుసుగా ప్రవర్తించడం వంటి సన్నివేశాలపై పలువురు మహిళలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సన్నివేశాలపై కొంతమంది మహిళలు షాహిద్ కపూర్ ను విమర్శిస్తూనే వున్నారు.

shahid kapoor,kabir singh,shahid hikes remuneration,kabir singh vs arjun reddy,shahid kapoor kabir singh,kabir singh movie,kabir singh trailer,arjun reddy,kabir singh shahid kapoor,arjun reddy vs kabir singh,shahid kapoor kabir singh box office,kabir singh song,kabir singh movie trailer,kabir singh trailer reaction,kabir singh box office collection,shahid kapoor kabir singh trailer,kabir singh movie songs
కబీర్ సింగ్ పోస్టర్


ఐతే తన సినిమాని పదే పదే విమర్శిస్తున్న ఆడవాళ్లతో పాటు మహిళ సంఘాలపై షాహిద్ కాస్తంత అసహనం వ్యక్తం చేశారు.తన సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. మరొక సినిమాను ఉదాహరణగా తీసుకొని తన సినిమాపై చేస్తున్న విమర్శలకు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.సంజయ్ దత్ జీవిత కథ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన `సంజూ` సినిమాలో ఓ డైలాగ్ ని ఈ సందర్భంగా తనను ట్రోల్ చేస్తోన్న వాళ్లకు గుర్తు చేసాడు. ’సంజూ' చిత్రంలో 300 మంది ఆడాళ్లతో గడిపానని హీరో డైలాగ్ చెబితే అప్పుడు లైట్ తీసుకొని వదిలేశారు. అదే నా  సినిమాకు వచ్చే వరకు  గొడవకు ఎందుకు దిగుతున్నారు అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు షాహిద్.మరోవైపు ‘మర్డర్’,‘జిస్మ్’ వంటి కొన్ని సినిమాలను ఈ సందర్భంగా గుర్తు చేసాడు. మొత్తానికి తన సినిమాపై వస్తోన్న ట్రోలింగ్స్‌కు షాహిద్ గట్టిగానే సమాధానమిచ్చాడు. ‘కబీర్ సింగ్’ సినిమా కంటే వల్గారిటీ, న్యూడిటీని ప్రమోట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయని గుర్తు చేసాడు. తన సినిమా సూపర్ హిట్ కావడాన్ని కొంత మంది జీర్ణించుకోలేక తన సినిమాను ఆడిపోసుకుంటాన్నరంటూ షాహిద్ చెప్పుకొచ్చాడు.

First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...