హోమ్ /వార్తలు /సినిమా /

Shahid Kapoor - Jersey OTT: షాహిద్ కపూర్ ‘జెర్సీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

Shahid Kapoor - Jersey OTT: షాహిద్ కపూర్ ‘జెర్సీ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

’జెర్సీ’ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ (Twitter/Photo)

’జెర్సీ’ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ (Twitter/Photo)

Jersey - Shahid Kapoor : వాయిదా పడ్డ షాహిద్ కపూర్ ’జెర్సీ’ మూవీ.. ఓమిక్రాన్ నేపథ్యంలో షాహిద్ కపూర్.. ‘జెర్సీ’ మూవీని పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే కదా. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది.

ఇంకా చదవండి ...

Jersey - Shahid Kapoor : షాహిద్ కపూర్  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ. ఈ సినిమా తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీకి రీమేక్‌గా అదే టైటిల్‌తో తెరకెక్కింది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు 22 ఏప్రిల్‌కు విడుదలైంది. ఇక ఈ సినిమాకు ఒక వారం ముందు విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2 దూకుడు ముందు ఈ సినిమా నిలవలేకపోయింది.   ఈ సినిమా నాని.. ‘జెర్సీ’ సినిమా  వలే ఆకట్టుకుంటుందని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.  ఈ సినిమాలో షాహిద్ కపూర్ క్రికెటర్ పాత్రలో అదరగొట్టారు. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను ఈ నెల 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

షాహిద్ కపూర్.. విషయానికొస్తే.. ఈయన తెలుగులో హిట్టైన  ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ‘అర్జున్ రెడ్డి’  విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోని చేసిన సినిమా ఇది.ఈ సినిమాను డైరెక్ట్‌ చేసిన సందీప్ వంగా పేరు దేశం యావత్తు మారుమోగింది.  రా లవ్‌స్టోరిని సందీప్‌ వంగా తెరకెక్కించిన తీరుకి అందరూ హ్యాట్సాఫ్‌ చెప్పారు.

View this post on Instagram


A post shared by Netflix India (@netflix_in)
ఇక అర్జున్ రెడ్డి డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగాతో ‘కబీర్ సింగ్’ సినిమా చేసిన షాహిద్ కపూర్.. ఇపుడు తెలుగులో నాని హీరోగా ‘జెర్సీ’ మూవీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరితోనే హిందీలో జెర్సీ’ సినిమాను చేసారు. ఈ చిత్రాన్ని  జెర్సీ మూవీని తెలుగులో నిర్మించిన నాగ వంశీ, దిల్ రాజు, అల్లు అరవింద్‌తో పాటు అమన్ గిల్‌తో కలిసి  నిర్మించారు. ఇక తెలుగులో సత్యరాజ్ చేసిన పాత్రలను హిందీలో షాహిద్ కపూర్.. వాళ్ల నాన్న పంకజ్ కపూర్ చేయడం విశేషం. వీళ్లిద్దరు తొలిసారి స్క్రీన్ పై ‘జెర్సీ’ సినిమాలో కనిపించనుండటం విశేషం. ఇక హిందీలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ చేసింది.‘జెర్సీ’ మూవీ  తెలుగులో హీరో నానిని సరికొత్త కోణంలో ప్రెజెంట్‌ చేసిన సినిమా. హిందీలో షాహిద్‌ను కొత్తగా చూపిస్తుంది కానీ ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు.   గౌతమ్‌ తిన్ననూరి విషయానికొస్తే.. ఈయన ‘మళ్లీరావా’ అనే ఒకే ఒక సినిమాతో డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత నానితో చేసిన ‘జెర్సీ’ మూవీ మంచి విజయాన్నేఅందుకున్నారు.

Niranjan Reddy S : రాజ్యసభకు నామినేట్ అయిన ‘ఆచార్య’ నిర్మాత నిరంజన్ రెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా..

కథపై నమ్మకంతో ఉద్వాసనకు గురైన ఓ ఉద్యోగి, ముప్పై ఆరేళ్ల క్రికెటర్‌ కొడుకు కోసం క్రికెట్‌ ఆడాలనుకోవడమే కథాంశం. క్రికెట్‌ ఆడితే ప్రాణాలు పోతాయని తెలిసినా కొడుకు కోసం క్రికెట్‌ ఆడటమే సినిమాలో ట్విస్ట్‌. తెలుగులో నానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రమిది. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.‘జెర్సీ’  సినిమా సక్సెస్‌ గౌతమ్‌ తిన్ననూరిని బాలీవుడ్‌లో దర్శకుడిగా మార్చేసింది. తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రం బాలీవుడ్ ఆడియన్స్‌ను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

First published:

Tags: Jersey movie, Netflix, Shahid Kapoor

ఉత్తమ కథలు