హోమ్ /వార్తలు /సినిమా /

Shahid Kapoor - Jersey : షాహిద్ కపూర్ ‘జెర్సీ’ మూవీ కొత్త రిలీజ్ ఇదే.. అఫీషియల్ ప్రకటన..

Shahid Kapoor - Jersey : షాహిద్ కపూర్ ‘జెర్సీ’ మూవీ కొత్త రిలీజ్ ఇదే.. అఫీషియల్ ప్రకటన..

‘జెర్సీ మూవీ కొత్త విడుదల తేది ప్రకటన(Twitter/Photo)

‘జెర్సీ మూవీ కొత్త విడుదల తేది ప్రకటన(Twitter/Photo)

Jersey - Shahid Kapoor : వాయిదా పడ్డ షాహిద్ కపూర్ ’జెర్సీ’ మూవీ.. ఓమిక్రాన్ నేపథ్యంలో షాహిద్ కపూర్.. ‘జెర్సీ’ మూవీని పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.

    Jersey - Shahid Kapoor : వాయిదా పడ్డ షాహిద్ కపూర్జెర్సీ’ మూవీ.. ఓమిక్రాన్ నేపథ్యంలో షాహిద్ కపూర్.. ‘జెర్సీ’ మూవీని పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే కదా.  గతేడాది చివర్లో రణ్‌వీర్ సింగ్ .. ‘83’ మూవీకి మంచి టాక్ వచ్చినా.. ముంబాయి సహా పలు నగరాల్లో నైట్ షోస్ కాన్సిల్స్‌తో ఈ సినిమాకు పెద్ద దెబ్బ పడింది. ఒక్క ఓవర్సీస్‌లోనే ఈ మూవీకి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ముంబై వంటి మెట్రో నగరాల్లో మాత్రం ‘83’కి అనుకున్నంత రేంజ్ రెస్పాన్స్ రావడం లేదు. ఈ కోవలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీని వాయిదా వేసారు. ఇప్పటికే  విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా ట్రైలర్ కూడా నాని.. ‘జెర్సీ’ సినిమా వలే ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ క్రికెటర్ పాత్రలో అదరగొట్టారు.

    షాహిద్ కపూర్.. విషయానికొస్తే.. ఈయన తెలుగులో హిట్టైన  ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ‘అర్జున్ రెడ్డి’  విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరోని చేసిన సినిమా ఇది.ఈ సినిమాను డైరెక్ట్‌ చేసిన సందీప్ వంగా పేరు దేశం యావత్తు మారుమోగింది.  రా లవ్‌స్టోరిని సందీప్‌ వంగా తెరకెక్కించిన తీరుకి అందరూ హ్యాట్సాఫ్‌ చెప్పారు. డిసెంబర్ 31 న విడుదల కావాల్సిన ఈ మూవీని తాజాగా ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్టు తాజాగా  ప్రకటించారు. అదే డేట్‌లో విడుదల కావాల్సిన ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ధా’ 11 ఆగష్టుకు పోస్ట్ పోన్ చేసారు. ఇక ఇదే రోజున యశ్, ప్రశాంత్ నీల్‌ల ‘కేజీఎఫ్ 2’ విడుదల కానుంది. మరోవైపు విజయ్ ‘బీస్ట్’ మూవీ విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాలు బాలీవుడ్‌లో బాగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

    ఇక అర్జున్ రెడ్డి డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగాతో ‘కబీర్ సింగ్’ సినిమా చేసిన షాహిద్ కపూర్.. ఇపుడు తెలుగులో నాని హీరోగా ‘జెర్సీ’ మూవీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరితోనే హిందీలో జెర్సీ’ సినిమాను చేసారు. ఈ చిత్రాన్ని  జెర్సీ మూవీని తెలుగులో నిర్మించిన నాగ వంశీ, దిల్ రాజు, అల్లు అరవింద్‌తో పాటు అమన్ గిల్‌తో కలిసి  నిర్మించారు. ఇక తెలుగులో సత్యరాజ్ చేసిన పాత్రలను హిందీలో షాహిద్ కపూర్.. వాళ్ల నాన్న పంకజ్ కపూర్ చేయడం విశేషం. వీళ్లిద్దరు తొలిసారి స్క్రీన్ పై ‘జెర్సీ’ సినిమాలో కనిపించనుండటం విశేషం. ఇక హిందీలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ చేసింది.

    Prabhas : పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల దూకుడు మాములుగా లేదుగా.. ప్రభాస్ నెక్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసిన అమ్మడు..

    ‘జెర్సీ’ మూవీ  తెలుగులో హీరో నానిని సరికొత్త కోణంలో ప్రెజెంట్‌ చేసిన సినిమా. హిందీలో షాహిద్‌ను కొత్తగా చూపిస్తుందడంలో డౌట్ లేదు.  గౌతమ్‌ తిన్ననూరి విషయానికొస్తే.. ఈయన ‘మళ్లీరావా’ అనే ఒకే ఒక సినిమాతో డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత నానితో చేసిన ‘జెర్సీ’ మూవీ మంచి విజయాన్నేఅందుకున్నారు.

    Naga Chaitanya - Rana : ఆ సూపర్ హిట్ రీమేక్‌లో నాగ చైతన్య, రానాల మల్టీస్టారర్‌..? త్వరలో అఫీషియల్ ప్రకటన..

    కథపై నమ్మకంతో ఉద్వాసనకు గురైన ఓ ఉద్యోగి, ముప్పై ఆరేళ్ల క్రికెటర్‌ కొడుకు కోసం క్రికెట్‌ ఆడాలనుకోవడమే కథాంశం. క్రికెట్‌ ఆడితే ప్రాణాలు పోతాయని తెలిసినా కొడుకు కోసం క్రికెట్‌ ఆడటమే సినిమాలో ట్విస్ట్‌. తెలుగులో నానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రమిది. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.‘జెర్సీ’  సినిమా సక్సెస్‌ గౌతమ్‌ తిన్ననూరిని బాలీవుడ్‌లో దర్శకుడిగా మార్చేసింది. తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రం బాలీవుడ్ ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Jersey movie, Shahid Kapoor, Tollywood

    ఉత్తమ కథలు