Jersey - Shahid Kapoor : వాయిదా పడ్డ షాహిద్ కపూర్ ’జెర్సీ’ మూవీ.. ఓమిక్రాన్ నేపథ్యంలో షాహిద్ కపూర్.. ‘జెర్సీ’ మూవీని పోస్ట్ పోన్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ వారం విడుదలైన రణ్వీర్ సింగ్ .. ‘83’ మూవీకి మంచి టాక్ వచ్చినా.. నైట్ షోస్ కాన్సిల్స్తో ఈ సినిమాకు పెద్ద దెబ్బ పడింది. ఒక్క ఓవర్సీస్లోనే ఈ మూవీకి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ముంబై వంటి మెట్రో నగరాల్లో మాత్రం ‘83’కి అనుకున్నంత రేంజ్ రెస్పాన్స్ రావడం లేదు. ఈ కోవలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ కూడా నాని.. ‘జెర్సీ’ సినిమా వలే ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్ క్రికెటర్ పాత్రలో అదరగొట్టారు.
షాహిద్ కపూర్.. విషయానికొస్తే.. ఈయన తెలుగులో హిట్టైన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండను స్టార్ హీరోని చేసిన సినిమా ఇది.ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ వంగా పేరు దేశం యావత్తు మారుమోగింది. రా లవ్‌స్టోరిని సందీప్ వంగా తెరకెక్కించిన తీరుకి అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు.
#Xclusiv... #BreakingNews... #Jersey POSTPONED... WON'T RELEASE ON 31 DEC... New date will be announced shortly... Industry talk that #Jersey will be Direct-to-OTT release is FALSE. pic.twitter.com/1MBwsSdWCC
— taran adarsh (@taran_adarsh) December 28, 2021
ఇక అర్జున్ రెడ్డి డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగాతో ‘కబీర్ సింగ్’ సినిమా చేసిన షాహిద్ కపూర్.. ఇపుడు తెలుగులో నాని హీరోగా ‘జెర్సీ’ మూవీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరితోనే హిందీలో జెర్సీ’ సినిమాను చేసారు. ఈ చిత్రాన్ని జెర్సీ మూవీని తెలుగులో నిర్మించిన నాగ వంశీ, దిల్ రాజు, అల్లు అరవింద్‌తో పాటు అమన్ గిల్‌తో కలిసి నిర్మించారు. ఇక తెలుగులో సత్యరాజ్ చేసిన పాత్రలను హిందీలో షాహిద్ కపూర్.. వాళ్ల నాన్న పంకజ్ కపూర్ చేయడం విశేషం. వీళ్లిద్దరు తొలిసారి స్క్రీన్ పై ‘జెర్సీ’ సినిమాలో కనిపించనుండటం విశేషం. ఇక హిందీలో కథానాయికగా మృణాల్ ఠాకూర్ చేసింది.
‘జెర్సీ’ మూవీ తెలుగులో హీరో నానిని సరికొత్త కోణంలో ప్రెజెంట్ చేసిన సినిమా. హిందీలో షాహిద్‌ను కొత్తగా చూపిస్తుందడంలో డౌట్ లేదు. గౌతమ్ తిన్ననూరి విషయానికొస్తే.. ఈయన ‘మళ్లీరావా’ అనే ఒకే ఒక సినిమాతో డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత నానితో చేసిన ‘జెర్సీ’ మూవీ మంచి విజయాన్నేఅందుకున్నారు.
కథపై నమ్మకంతో ఉద్వాసనకు గురైన ఓ ఉద్యోగి, ముప్పై ఆరేళ్ల క్రికెటర్ కొడుకు కోసం క్రికెట్ ఆడాలనుకోవడమే కథాంశం. క్రికెట్ ఆడితే ప్రాణాలు పోతాయని తెలిసినా కొడుకు కోసం క్రికెట్ ఆడటమే సినిమాలో ట్విస్ట్. తెలుగులో నానికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రమిది. అంతేకాదు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.‘జెర్సీ’ సినిమా సక్సెస్ గౌతమ్ తిన్ననూరిని బాలీవుడ్లో దర్శకుడిగా మార్చేసింది. మొత్తంగా డిసెంబర్ 31న విడుదల కావాల్సిన ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Jersey movie, Shahid Kapoor