ఎపుడు వివాదాలకు ఆమడ దూరంలో ఉండే ప్రభాస్ తాజాగా విజయ్ దేవరకొండపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. హీరోగా విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. తెలుగులో కల్ట్ క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనను చూసి మెచ్చుకోని వారు ఉండరు. అంతలా అర్జున్ రెడ్డిగా తెలుగు ప్రేక్షకులపై గొప్ప ఇంపాక్ట్ చూపించాడు విజయ్ దేవరకొండ. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ నటన కంటే ఆ మూవీ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లో యాక్ట్ చేస్తోన్న షాహిద్ కపూర్ నటనే బాగుందని కామెంట్ చేసినట్టు ఒక ఇంగ్లీష్ పత్రికలో ప్రచురితం కావడం ఇపుడు కలకలం రేపుతోంది.
అంతేకాదు ‘అర్జున్ రెడ్డి’ కన్నా ‘కబీర్ సింగ్’ రీమేక్ చాలా బాగా వచ్చిందని ప్రభాస్ తన అభిప్రాయాలను ఈ మూవీ హీరో షాహిద్ కపూర్‌కు పర్సనల్‌గా ఫోన్లో చెప్పినట్టు ఆ పత్రిక పేర్కొంది.ఐతే షాహిద్‌కు ప్రభాస్ వ్యక్తిగతంగా చేసిన ఫోన్ వివరాలు ఎలా బయటకు వచ్చాయన్న విషయాన్ని ఆ పత్రిక బయట పెట్టకపోవడం విశేషం. ఐతే ప్రభాస్ పొగడ్తలకు పొంగి పోయిన షాహిద్ కపూర్ పీఆర్ టీమ్ వల్ల ఈ రచ్చ అంతా జరిగిందని ఆ పత్రిక చెప్పుకొచ్చింది.
ఐతే ‘బాహుబలి’ సిరీస్‌తో ప్రభాస్ గ్లోబల్ హీరో అయిన నేపథ్యంలో ఇపుడు అతను తెలుగు అర్జున్ రెడ్డిని పోల్చుతూ కబీర్ సింగ్ సినిమా చేసిన కామెంట్స్ బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ నిజంగానే ఇలాంటి కామెంట్స్ చేసాడా లేదా అనే విషయమై సదరు పత్రిక క్లారిటీ ఇవ్వలేదు. ఐనా ప్రభాస్ కామెంట్ చేసినట్టు వస్తున్న వార్తలపై విజయ్ దేవరకొండ అభిమానులకు తీవ్ర అసహానికి గురి చేసినట్టు సమాచారం. రీసెంట్గా విజయ్ దేవరకొండ కూడా సందీప్ రెడ్డి..హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్‌ను అంతకంటే బాగానే తీస్తున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: #Prabhas20, Arjun Reddy, Bahubali, Kabir Singh, Prabhas, Prabhas Latest News, Saaho, Shahid Kapoor, Shraddha Kapoor, Vijay Devarakonda