బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్(shah rukh khan) కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) గతేడాది డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో అతడికి భారీ ఊరట లభించింది. డ్రగ్స్ కేసు(Drugs case)లో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ లభించింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్‌ను అరెస్టు చేసిన తరువాత కొన్ని రోజుల పాటు అతన్ని రిమాండ్‌లోనే ఉంచారు. ఎన్‌సీబీ అధికారుల వ్యూహాత్మక నిర్ణయాలతో ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ లభించలేదు. అయితే అసలు ఆర్యన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఏవీ లేవన్న కారణంతో.. న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించగా.. కోర్టు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఆర్యన్‌ఖాన్ కు వ్యతిరేకంగా ఎన్‌సీబీ అధికారులు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంలో విఫలం అయ్యారు. దీంతో ఈ కేసులో ఎన్బీసీ ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దంతో
గతేడాది అక్టోబర్ 2వ తేదీన ముంబైలోని సముద్ర ప్రాంతంలో ఉన్న ఓ క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు దాడి చేసి మొత్తం 14 మందిని అరెస్టు చేసిన విషయం విదితమే. వారిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. అలాగే పలువురు బిగ్‌షాట్స్‌కు చెందిన పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ లభించింది. క్రూయిజ్ షిప్‌పై దాడి చేసినప్పుడు ఎన్‌సీబీ అధికారులు అక్కడ వీడియోలు తీయలేదు. వాస్తవానికి ఇలాంటి సంఘటనల్లో ఎప్పుడైనా సరే ఎన్‌సీబీ అధికారులు వీడియోలు తీస్తారు. కానీ ఆ షిప్ మీద దాడి చేసినప్పుడు మాత్రం వీడియోలు తీయలేదు. దీంతో ఆ వీడియోలను కోర్టుకు సమర్పించలేకపోయారు.
అలాగే ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు, అమ్మినట్లు ఎక్కడా సాక్ష్యాలను కూడా రాబట్టలేకపోయారు. దీంతో ఆర్యన్ ఖాన్‌కు ఈ కేసులోఊరట లభించింది. అతనికి ఈ కేసులో ఎన్సీబీ క్లీన్ చిట్ దక్కింది. గతేడాది అక్టోబర్ 28న ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అతడు అక్టోబర్ 30న అతని తండ్రి షారుక్ బర్త్ డే రోజున జైలు నుంచి బయటకు వచ్చాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.