Pathaan Movie Run Time Lock: గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు. ఒకపుడు బాలీవుడ్ సినిమాలో సెక్స్ కంటెంట్ అన్న ఉండాలి. లేకపోతే షారుఖ్ అన్న ఉండాలనేది సినీ ప్రముఖులు చెప్పుకునే వాళ్లు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఒకపుడు కింగ్ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన ఈయన ఇపుడు హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఈయన సినిమాలు వచ్చనవి వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బొక్కాబోర్లాపడుతున్నాయి. ఈయన చివరగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతూనే ఉన్నాయి. మిగిలిన బాలీవుడ్ హీరోలందరు...ఒక టైపు క్యారెక్టర్స్ చేయకుండా...వెరైటీ రోల్స్‌తో ఆకట్టుకుంటుంటే...షారుఖ్ ఖాన్ మాత్రం రొటీన్ మాస్ మసాల సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ రేసులో చాలా వెనకబడ్డాడు.
ఇపుడు ‘పఠాన్’ మూవీ అంటూ రొటీన్ యాక్షన్ డ్రామా అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 146.16 నిమిషాలు ( 2 గంటల 26 నిమిషాల 16 సెకన్లు) ఉంది.
#Xclusiv... ‘PATHAAN’ RUN TIME... #Pathaan certified 'UA' by #CBFC on 2 Jan 2023. Duration: 146.16 min:sec [2 hours, 26 min, 16 sec]. #India ⭐ Theatrical release date: [Wednesday] 25 Jan 2023. pic.twitter.com/3Ue8oXmBni
— taran adarsh (@taran_adarsh) January 17, 2023
ఇక ఈ సినిమాలో వివాదాస్పదమైన బేషరమ్ రంగ్ పాటపై సెన్సార్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇందులో దీపికా పదుకొణే గ్లామర్ ఒలకబోతపై సెన్సార్ వాళ్లు మూడు కట్స్ చెప్పింది. అంతేకాదు ఈ సినిమాలో పలు సన్నివేశాలను మార్పులు చేసినట్టు చెప్పారు. మొత్తంగా ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు 10కి పైగా కట్స్ చెప్పారట. అంతేకాదు ఈ సినిమాలో డైలాగులపై కూడా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. దీంతో పలు సన్నివేశాల్లో డైలాగులను మార్చినట్టు సమాచారం. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 20న ప్రారంభించనున్నారు. ముంబైలోని ఐకానిక్ గేటీ సినిమాలో ప్రత్యేకంగా ప్రదర్శన చేయనున్నట్టు ప్రకటించారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ‘బేషరమ్’ సాంగ్ సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీపిక పదుకొణె అందాల ఆరబోతపై విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సార్ బోర్డు ఈ పాటకు మూడు కట్స్ చెప్పింది. దీపిక గోల్డెన్ స్విమ్‌సూట్‌లో ఉన్న మూడు క్లోజప్ షాట్స్, కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌లో మార్పులు చేశారు. ఇక సినిమా మొత్తం మీద 10కు పైగా కట్స్ చెప్పారట. సంభాషణలకు సంబంధించిన సూచనలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రదర్శన సమయానికి సెన్సార్‌బోర్డు సూచనల మేరకు మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఇక రష్యాలోని సైబీరియాలో షూటింగ్ జరుపుకున్న తొలి బాలీవుడ్ చిత్రంగా ‘పఠాన్’ మూవీ రికార్డులకు ఎక్కింది. ఇక్కడ పలు జేమ్స్ బాండ్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా విడుదలకు వారం రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ ఈ సినిమాను జోరుగా ప్రచారం చేస్తోంది.
ఆ సంగతి పక్కనపెడితే... రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది. ఈ సినిమాలో ‘ఔట్ ఫిక్స్’ అనే ప్రైవేట్ టెర్రరిజం గ్రూపు.. ఒక దేశం నుంచి సుపారీ వేరే దేశాన్ని నాశనం చేసే గ్రూపు. ఈ గ్రూపుకు అధిపతి జాన్ అబ్రహం. ఏ టెర్రరిస్ట్ గ్రూపు అయిన ఏదో ఒక ఉద్దేశ్యం, లక్ష్యంతో పని చేస్తూ ఉంటుంది. కానీ ఈ గ్రూపు మాత్రం ఏ లక్ష్యం లేకుండా.. పైసల కోసం ఎలాంటి దుర్మార్గాపు పని చేసే టెర్రరిస్ట్ గ్రూపు. ఈ గ్రుపు భారత్‌లోని కొన్ని నగరాలపై మిస్సైల్స్‌తో గురి పెడుతుంది. ఈ గ్రూపు కార్యక్రమాలను అంతం చేయడానికి అజ్ఞాతంలో ఉన్న పఠాన్ అనే రా ఏజెంట్‌ను భారత ప్రభుత్వం నియమిస్తోంది.అతనికి దీపికా అనే మరో ‘రా‘ గూఢచారి సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో పఠాన్ అనే గూఢచారి.. ఈ ప్రైవేట్ టెర్రిరిస్ట్ గ్రూపును ఎలా అంతం చేసాడనేదే ఈ సినిమా స్టోరీలా కనబడుతోంది. పఠాన్ మూవీ విడుదలకు ముందే డిజిటిల్ రైట్స్ కు భారీ డీల్ కుదిరింది.
డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొన్ని కోట్ల రూపాయలకు రిజర్వ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ "ఓ టి టి" హక్కులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 100 కోట్ల ఆఫర్ చేసినట్లు , దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మివేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్.. దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు దీపికాకు రూ. 15 కోట్లు.. జాన్ అబ్రహంకు రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.
ఈ చిత్రంలో షారుఖ్ .. ‘రా’ ఏజెంట్ పాత్రలో చక్కగా నటించాడు. ఈ సినిమా స్టోరీ చూస్తుంటే.. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైతో పాటు పాత జేమ్స్‌బాండ్ సినిమాలను గుర్తుకు తెస్తున్నాయి. గతంలో ఇంగ్లీషులో హిందీతో పాటు తెలుగులో ఇలాంటి మాస్ యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. మరి రెగ్యులర్ మాస్ ‘రా’ ఏజెంట్ కథతో వస్తోన్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ నెల 25న భారత గణతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. మొత్తంగా రొటీన్ మాస్ యాక్షన్ ప్లస్ వివాదాల నడుమ వస్తోన్న ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తుందనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Deepika Padukone, Pathaan Movie, Shah Rukh Khan