హోమ్ /వార్తలు /సినిమా /

Shah Rukh Khan : చిరంజీవి రచయతతో షారుఖ్ ఖాన్ నెక్ట్స్ మూవీ.. అధికారిక ప్రకటన..

Shah Rukh Khan : చిరంజీవి రచయతతో షారుఖ్ ఖాన్ నెక్ట్స్ మూవీ.. అధికారిక ప్రకటన..

షారుఖ్ ఖాన్, చిరంజీవి (Twitter/Photo)

షారుఖ్ ఖాన్, చిరంజీవి (Twitter/Photo)

Shah Rukh Khan : చిరంజీవి రచయతతో షారుఖ్ ఖాన్ నెక్ట్స్ మూవీ.. అధికారిక ప్రకటన చేశారు. దీంతో షారుఖ్ ఖాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  Shah Rukh Khan : బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌కు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేవు. కింగ్ ఖాన్‌ విషయానికొస్తే.. ఒకప్పుడు  తన పేరుతో బాలీవుడ్ బాక్సాఫీస్‌లను షేక్ చేసిన ఈయన..ఇపుడు తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. దాదాపు ఏడేళ్ల క్రితం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా అప్పట్లోనే రూ.400 కోట్లను వసూలు చేసి బాలీవుడ్‌లో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత షారుఖ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర స‌రిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. దీంతో చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. క‌నీసం ఈయన సినిమా రూ. 100 కోట్లు వ‌సూలు చేయ‌డానికి కూడా ఇబ్బంది ప‌డే స్థాయికి వ‌చ్చేసాయి. ఆ తర్వాత విడుదలైన సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.

  ఇక చివరగా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జీరో’ కూడా కింగ్ ఖాన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సినిమా ఫలితం తర్వాత షారుఖ్ ..తాను యాక్ట్ చేయబోయే సినిమాల విషయంలో పునరాలోచనలో పడ్డాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్. .సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్ అబ్రహం విలన్‌గా యాక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.

  KGF Chapter 2 OTT : కేజీఎఫ్ 2 ఓటీటీ విడుదల తేది ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే..


  షారుఖ్  ఖాన్.. తమిళ అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్న అట్లీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. రీసెంట్‌గా ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ‘లయన్’ టైటిల్‌ను ఫిక్స్ చేసారట. ఈ చిత్రంతో నయనతార లేదా సమంత కథానాయికగా నటించే అవకాశం ఉంది. మరో హీరోయిన్‌గా ప్రియమణి దాదాపు ఖరారైంది.

  NBK - Jr NTR : బాబాయి బాలయ్యతో కాలేనిది.. అబ్బాయి ఎన్టీఆర్ చేసి చూపించారుగా..


  తాజాగా షారుఖ్ ఖాన్.. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల ఒరిజినల్ దర్శకుడు మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్ చిత్రాలను తెరకెక్కించిన రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. ఈ సినిమాలో తాప్సీ పన్ను కథానాయికగా నటించుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 22 డిసెంబర్ 2023న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

  రీసెంట్‌గా షారుఖ్ ఖాన్..పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్..  ముంబై నార్కొటిక్స్ వాళ్లకు ఓ ఓడలో రెడ్ హ్యాండెడ్‌గా డ్రగ్స్ వాడుతూ పట్టుబడటం పెద్ద సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసులో కోర్టు ఆర్యన్ ఖాన్‌కు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కదా.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Chiranjeevi, Rajkumar Hirani, Shah Rukh Khan

  ఉత్తమ కథలు