Shahrukh Khan: తిన్నావా బేటా.. లేదు డాడీ... జైల్లో షారూఖ్, ఆర్యన్ మధ్య ఆసక్తికర సంభాషణ

ఆర్యన్ ఖాన్, షారూఖ్ ఖాన్

Aryan Khan | Shahrukh Khan: ఐతే తండ్రీ కొడుకుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు జైలు వర్గాల ద్వారా తెలిసింది. ఆర్యన్.. ఏమైనా తిన్నవా.. బేటా.. అని షారూఖ్ అడగడంతో.. లేదు డాడీ.. అని ఆర్యన్ తల ఊపాడు. ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం ఏదైనా ఆర్యన్‌కు ఇవ్వొచ్చా అని జైలు అధికారులను షారూఖ్ ఖాన్ అడిగారు. ,

 • Share this:
  డ్రగ్స్ కేసు (Drugs Case) ఇప్పుడు బాలీవుడ్‌ (Bollywood)ను షేక్ చేస్తోంది. ముంబై తీరంలో క్రూయిజ్‌లో షిప్ భారీగా డ్రగ్స్ పట్టుబడటం, ఆ కేసులో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Sharukh khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) అరెస్ట్ కావడం సంచలనం రేపింది. ఐతే ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రావడం లేదు. ఇప్పటికే మూడు సార్లు తిరస్కరణకు తిరస్కరించారు. ఆయనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలున్నాయని, బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని ముంబైలోని స్పెషల్ కోర్టు (Mumbai Special court) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ జైలుకే పరిమతమయ్యాడు. ఐతే ఇవాళ్టి నుంచి కరోనా నిబంధనలను మహారాష్ట్ర ప్రభుత్వం సడలించడంతో జైలులో ఉన్న ఖైదీలు, అండర్ ట్రయల్ నిందితులను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతిస్తున్నారు. ఈ  క్రమంలోనే షారూఖ్  ఖాన్ కూడా గురువారం తన కుమారుడు ఆర్యన్‌ను కలిసేందుకు ఆర్థర్ రోడ్డు జైలుకు వెళ్లారు.

  ప్రతి వారం కుటుంబ సభ్యులు లేదంటే లాయర్‌కు నిందితుడిని కలిసే అవకాశం కల్పిస్తారు. ఒకేసారి ఇద్దరు వ్యక్తులు కూడా కలవచ్చు.  ఐతే ఇవాళ షారూఖ్ ఖాన్ ఒక్కరే తన కుమారుడిని కలిసినట్లు తెలిసింది. ప్రవేశ ద్వారం వద్ద ఆధార్ కార్డు, ఇతర పత్రాలు చూపించి జైలు లోపలికి వెళ్లారు షారూఖ్ ఖాన్. వీఐపీ అని జైల్లో ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. సెలబ్రిటీలా కాకుండా సాధారణ వ్యక్తిలానే జైలు క్యాబినెట్‌లో తన తనయుడిని కలిశారు షారూఖ్. అక్టోబరు 3న ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసిన తర్వాత.. షారూఖ్ తన కుమారుడిని కలవడం ఇదే తొలిసారి.

  6 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించిన కేసులో బుక్కైనా మెగా డైరెక్టర్ శంకర్ అల్లుడు..

  జైలు నిబంధనల ప్రకారం ఇద్దరు నేరుగా కలవడానికి వీల్లేదు. గాజు గోడకు ఇవతల ఒకరు, అవతల ఒకరు నిలబడి.. ఒకరినొకరు చూసుకుంటూ ఇంటర్‌కమ్‌లో మాట్లాడారు. దాదాపు 10 నిమిషాల పాటు ముచ్చటించారు. ఆ సమయంలో గాజు గోడపై ఇద్దరు చేతులు ఆనించి మాట్లాడుకున్నారు. తండ్రిని చూసి ఆర్యన్ ఖాన్ భావోగ్వానికి లోనయ్యారు. అలాగే తనయుడిని చూసి షారూఖ్ ఖాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అంతా మంచే జరుగుతుంది.. ధైర్యంగా ఉండమని తన కుమారుడికి చెప్పారు షారూఖ్. వీరిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ నలుగురు జైలు గార్డ్స్ కాపలాగా ఉన్నారు.

  కష్టకాలంలో మహేష్ బాబుకు అండగా నిలిచిన నాగ చైతన్య..

  ఐతే తండ్రీ కొడుకుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు జైలు వర్గాల ద్వారా తెలిసింది. ఆర్యన్.. ఏమైనా తిన్నవా.. బేటా.. అని షారూఖ్ అడగడంతో.. లేదు డాడీ.. అని ఆర్యన్ తల ఊపాడు. ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం ఏదైనా ఆర్యన్‌కు ఇవ్వొచ్చా అని జైలు అధికారులను షారూఖ్ ఖాన్ అడిగారు. నిబంధనల ప్రకారం కోర్టు అనుమతి లేనిదే ఏవీ ఇవ్వకూడదని వారు చెప్పారు.  ఆ తర్వాత మరికాసేపు కుమారుడితో మాట్లాడి.. జైలు నుంచి వెళ్లిపోయారు షారూఖ్.

  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ తీసుకున్న రెమ్యునరేషన్

  మరోవైపు ముంబై స్పెషల్ కోర్టు తీర్పుపై ఆర్యన్ ఖాన్ లాయర్ అప్పీల్‌కు వెళ్లారు. బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబరు 23న హైకోర్టు విచారించనుంది.
  Published by:Shiva Kumar Addula
  First published: