Pathaan Movie Twitter Review : షారుఖ్ ఖాన్ అంటే కేవలం హిందీ సినిమాలు చూసే వారికి మాత్రమే కాదు, ఇటు సౌత్ లోను ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, పరిచయం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ట్రాక్ రికార్డ్ ఏమంత బాగాలేదు. ఒకపుడు కింగ్ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన షారుఖ్‌కు వరుసగా పరాజయాలు వస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్గా షారుఖ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ (Pathaan Movie ). భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా 7700 స్రీన్స్లో విడుదలవుతోంది. అందులో ఇండియాలో 5200 ఉండగా.. ఓవర్సీస్ 2500. ఇక ఈ సినిమా ఇటు హిందీతో పాటు తెలుగు, తమిళ భాషాల్లో ఒకేసారి విడుదలవుతోంది. ఇప్పటికే పాటలతో పాటు ట్రైలర్‌తో కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది సినిమా. ఇక ఈసినిమాకు కూడా ఓ రేంజ్లో బుకింగ్స్ జరిగాయి. బాహుబలి 2(హిందీ), తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఈసినిమా బుకింగ్స్ పరంగా తన సత్తాను చాటింది. బాహుబలి 2(హిందీ)కి 6.50 లక్షల టిక్కెట్స్ బుక్ అవ్వగా.. పఠాన్‌కు 5.56 లక్షల టిక్కెట్స్ బుక్ అయ్యాయి. ఇక పఠాన్ తర్వాత కేజీయ్ 2, వార్ సినిమాలున్నాయి.
బుకింగ్స్ భారీగా ఉండడంతో ఫస్ట్ డే పఠాన్ 55 కోట్ల వరకు వసూలు చేయోచ్చని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఎలా ఉంది.. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి. పఠాన్‌తో షారుఖ్ హిట్ కొట్టినట్లేనా.. ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకోనుందో.. వంటి విషయాలను ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..
SRK is back!!
Bollywood is scoring big with this one. King Khan has brought glory to the industry. Deepika's beauty is as hot as a volcano. Well written and greatly choreographed action sequences. *SUSPENSE THRILLER* Our rating for this film is 4/5. #Pathaan #PathaanReview — Censor Reports ???? (@CensorReports) January 25, 2023
#PathaanFirstDayFirstShow #PathaanReview #Pathaan ❤️❤️❤️❤️???????????????? https://t.co/9S1iiUTgV2
— Manna (@Are_Manna) January 25, 2023
The best ever intro scene for the return of the King! You can't ask for more. #Pathaan
???????????????? #ShahRukhKhan???? pic.twitter.com/i1CEGufsZl — Ⓐ (@Aashkey) January 25, 2023
Complete FIRST HALF
WTF????????????????????#Pathaan — k (@Iosingame_) January 25, 2023
Now watching #Pathaan ????
An SRK film after 4 years ????❤️ Theatre is packed! ???? I can say one word , The KING is Back ???? #PathaanFirstDayFirstShow #ShahRukhKhan???? #SRK???? — Fan Of Ambedkar (@DBossDARSHAN2) January 25, 2023
Just watched #Pathaan and I have to say, @iamsrk absolutely nailed it! The storytelling, acting, and direction were all top-notch. A must-watch for all Bollywood fans. #sharukhkhan #moviereview #bollywood
— bababoltahai (@DFrahx) January 25, 2023
ట్విట్టర్ రివ్యూలను బట్టి చూస్తే సినిమా సూపర్ హిట్ అని తెలుస్తోంది. ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. చూడాలి మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఏమేరకు వసూళ్లను రాబట్టనుందో.. సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా రన్ టైమ్ 146.16 నిమిషాలు ( 2 గంటల 26 నిమిషాల 16 సెకన్లు) ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ‘బేషరమ్’ సాంగ్ సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీపిక పదుకొణె (Deepika Padukone) అందాల ఆరబోతపై విమర్శలు వెల్లువెత్తాయి.
#Xclusiv… #Pathaan *final* screen count... ⭐ #India: 5200 [#Hindi + #Tamil + #Telugu] ⭐️ #Overseas: 2500 ⭐️ Worldwide total: screens: 7700 screens. pic.twitter.com/Ce7uUthgxT
— taran adarsh (@taran_adarsh) January 24, 2023
ఇక రష్యాలోని సైబీరియాలో షూటింగ్ జరుపుకున్న తొలి బాలీవుడ్ చిత్రంగా ‘పఠాన్’ మూవీ రికార్డులకు ఎక్కింది. ఇక్కడ పలు జేమ్స్ బాండ్ చిత్రాలను తెరకెక్కించారు. సినిమా కథ విషయానికి వస్తే.. ‘ఔట్ ఫిక్స్’ అనే ప్రైవేట్ టెర్రరిజం గ్రూపు.. ఒక దేశం నుంచి సుపారీ వేరే దేశాన్ని నాశనం చేసే గ్రూపు. ఈ గ్రూపుకు అధిపతి జాన్ అబ్రహం. ఏ టెర్రరిస్ట్ గ్రూపు అయిన ఏదో ఒక ఉద్దేశ్యం, లక్ష్యంతో పని చేస్తూ ఉంటుంది. కానీ ఈ గ్రూపు మాత్రం ఏ లక్ష్యం లేకుండా.. పైసల కోసం ఎలాంటి దుర్మార్గాపు పని చేసే టెర్రరిస్ట్ గ్రూపు. ఈ గ్రుపు భారత్‌లోని కొన్ని నగరాలపై మిస్సైల్స్‌తో గురి పెడుతుంది. ఈ గ్రూపు కార్యక్రమాలను అంతం చేయడానికి అజ్ఞాతంలో ఉన్న పఠాన్ అనే రా ఏజెంట్‌ను భారత ప్రభుత్వం నియమిస్తోంది.అతనికి దీపికా అనే మరో ‘రా‘ గూఢచారి సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో పఠాన్ అనే గూఢచారి.. ఈ ప్రైవేట్ టెర్రిరిస్ట్ గ్రూపును ఎలా అంతం చేసాడనేదే ఈ సినిమా స్టోరీలా కనబడుతోంది.
పఠాన్ మూవీ విడుదలకు ముందే డిజిటిల్ రైట్స్ కు భారీ డీల్ కుదిరింది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొన్ని కోట్ల రూపాయలకు రిజర్వ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ "ఓ టి టి" హక్కులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 100 కోట్ల ఆఫర్ చేసినట్లు , దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మివేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్.. దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు దీపికాకు రూ. 15 కోట్లు.. జాన్ అబ్రహంకు రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. మాస్ ‘రా’ ఏజెంట్ కథతో వస్తోన్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. జనవరి 25న భారత గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.