Pathaan Movie Trailer Talk Review: గత కొన్నేళ్లుగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు. ఒకపుడు బాలీవుడ్ సినిమాలో సెక్స్ కంటెంట్ అన్న ఉండాలి. లేకపోతే షారుఖ్ అన్న ఉండాలనేది సినీ ప్రముఖులు చెప్పుకునే వాళ్లు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఒకపుడు కింగ్ ఖాన్‌గా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన కనుసైగలతో శాసించిన ఈయన ఇపుడు హీరోగా ఉనికి కోసం పోరాడుతున్నాడు. ఈయన సినిమాలు వచ్చనవి వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బొక్కాబోర్లాపడుతున్నాయి. ఈయన చివరగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతూనే ఉన్నాయి. మిగిలిన బాలీవుడ్ హీరోలందరు...ఒక టైపు క్యారెక్టర్స్ చేయకుండా...వెరైటీ రోల్స్‌తో ఆకట్టుకుంటుంటే...షారుఖ్ ఖాన్ మాత్రం రొటీన్ మాస్ మసాల సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ రేసులో చాలా వెనకబడ్డాడు.
ఈ కోవలో షారుఖ్ కూడా ‘జీరో’ అంటూ ప్రయోగాత్మక చిత్రం చేసారు. ఈ సినిమాలో ఖాన్.. మరుగుజ్జుగా కనిపించారు. ఐనా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఈయన ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘పఠాన్’. మధ్యలో ‘రాకేట్రీ.. ది నంబి ఎఫెక్ట్’, లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసారు. తాజాగా ఈయన హీరోగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ మూవీలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ సాంగ్ పై హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు థియేటర్స్ దగ్గర షారుఖ్.. ‘పఠాన్’ మూవీ పోస్టర్స్‌ను చించేస్తున్నారు. మరోవైపు సెన్సార్ వాళ్లు ఈ సినిమాలో బేషరమ్ పాటపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
SRK - DEEPIKA - JOHN: ‘PATHAAN’ TRAILER IS HERE… #SRK returns to the big screen with #Pathaan… Promises some breathtaking action scenes… Costars #DeepikaPadukone and #JohnAbraham… #PathaanTrailer: https://t.co/a7lFht6WB1#YRF50 pic.twitter.com/4xjlk8iJvK
— taran adarsh (@taran_adarsh) January 10, 2023
ఆ సంగతి పక్కనపెడితే... తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది. ఈ సినిమాలో ‘ఔట్ ఫిక్స్’ అనే ప్రైవేట్ టెర్రరిజం గ్రూపు.. ఒక దేశం నుంచి సుపారీ వేరే దేశాన్ని నాశనం చేసే గ్రూపు. ఈ గ్రూపుకు అధిపతి జాన్ అబ్రహం. ఏ టెర్రరిస్ట్ గ్రూపు అయిన ఏదో ఒక ఉద్దేశ్యం, లక్ష్యంతో పని చేస్తూ ఉంటుంది. కానీ ఈ గ్రూపు మాత్రం ఏ లక్ష్యం లేకుండా.. పైసల కోసం ఎలాంటి దుర్మార్గాపు పని చేసే టెర్రరిస్ట్ గ్రూపు. ఈ గ్రుపు భారత్‌లోని కొన్ని నగరాలపై మిస్సైల్స్‌తో గురి పెడుతుంది. ఈ గ్రూపు కార్యక్రమాలను అంతం చేయడానికి అజ్ఞాతంలో ఉన్న పఠాన్ అనే రా ఏజెంట్‌ను భారత ప్రభుత్వం నియమిస్తోంది.అతనికి దీపికా అనే మరో ‘రా‘ గూఢచారి సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో పఠాన్ అనే గూఢచారి.. ఈ ప్రైవేట్ టెర్రిరిస్ట్ గ్రూపును ఎలా అంతం చేసాడనేదే ఈ సినిమా స్టోరీలా కనబడుతోంది. పఠాన్ మూవీ విడుదలకు ముందే డిజిటిల్ రైట్స్ కు భారీ డీల్ కుదిరింది.
డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొన్ని కోట్ల రూపాయలకు రిజర్వ్ చేసినట్లు సమాచారం. ఈ మూవీ "ఓ టి టి" హక్కులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 100 కోట్ల ఆఫర్ చేసినట్లు , దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మివేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.
ఈ చిత్రంలో షారుఖ్ .. ‘రా’ ఏజెంట్ పాత్రలో చక్కగా నటించాడు. ఈ సినిమా స్టోరీ చూస్తుంటే.. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైతో పాటు పాత జేమ్స్‌బాండ్ సినిమాలను గుర్తుకు తెస్తున్నాయి. గతంలో ఇంగ్లీషులో హిందీతో పాటు తెలుగులో ఇలాంటి మాస్ యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. మరి రెగ్యులర్ మాస్ ‘రా’ ఏజెంట్ కథతో వస్తోన్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ నెల 25న భారత గణతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. మొత్తంగా రొటీన్ మాస్ యాక్షన్ ప్లస్ వివాదాల నడుమ వస్తోన్న ‘పఠాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తుందనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Deepika Padukone, John Abraham, Pathaan Movie, Shah Rukh Khan