మరో వివాదంలో షారుఖ్ ఖాన్.. సినిమాలు లేక వెబ్ సిరీస్‌ నిర్మిస్తే..

షారుక్ ఖాన్ ఫైల్ ఫోటో (Source: Twitter)

గత కొంత కాలంగా షారుఖ్‌ ఖాన్‌కు సరైన హిట్టు లేదు. చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత ఈ బాలీవుడ్ బాద్‌షాకు హిట్టు ముఖం చూసిందే లేదు. తాజాగా ఈయన నిర్మించిన ఓ వెబ్ సిరీస్ లీగల్ ఇష్యూలో చిక్కుకుంది.

 • Share this:
  గత కొంత కాలంగా షారుఖ్‌ ఖాన్‌కు సరైన హిట్టు లేదు. చెన్నై ఎక్స్‌ప్రెస్ తర్వాత ఈ బాలీవుడ్ బాద్‌షాకు హిట్టు ముఖం చూసిందే లేదు. ఒకపుడు బాలీవుడ్‌లో సినిమాలు నడవాలంటే అందులో సెక్స్ అయినా ఉండాలి. లేకపోతే షారుఖ్ అయినా ఉండాలి అనే వారు. ప్రస్తుతం షారుఖ్ తన స్థాయికి తగ్గట్టు అసలు సిసలు హిట్టు ఇవ్వలేక చాలా ఏళ్లే అవుతుంది. 2018 చివర్లో జీరో సినిమా తర్వాత షారుఖ్.. మరో సినిమా అనేది ఒప్పుకోలేదు. ఆయన అభిమానులు కూడా కింగ్ ఖాన్ సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ప్రస్తుతం హీరోగా షారుఖ్ ఖాన్ మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది. తాజాగా ఈయన రెడ్ చిల్లీస్ పతాకంపై వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన ‘బేతాళ్’ అనే వెబ్ సిరీస్ నిర్మించారు. ఇందులో వినీత్ కుమార్, అహనా కుమ్రా, సుచిత్రా పిళ్లై, జితేంద్ర జోషి నటించారు. ఈ వెబ్ సిరీస్‌ను నిఖిల్ మహాజన్, పాట్రిక్ గ్రాహం డైరెక్ట్ చేసాడు. ఈ వెబ్ సిరీస్ తొలి సీజన్ ఈ నెల 24న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

  shah rukh khan betaal web series faces legal troubles in story issue ,shahrukh khan betaal,shah rukh khan betaal web series,shah rukh khan betaal,shah rukh khan,betaal,shahrukh khan,betaal shahrukh khan,betaal trailer,shahrukh khan betaal trailer,betaal netflix,betaal web series,shah rukh khan netflix,shah rukh khan new netflix show,ranbir kapoor and shah rukh khan,shah rukh khan betaal,shahrukh khan film,shah rukh khan produce netflix series,sharukh khan's horor series betaal,betaal sharukh khan,shah rukh khan betaal netflix,betaal official trailer,shahrukh khan betaal web series,shah rukh khan netflix betaal,షారుఖ్ ఖాన్,షారుఖ్ ఖాన్ వెబ్ సిరీస్.షారుఖ్ ఖాన్ బేతాల్ వెబ్ సిరీస్,షారుఖ్ బేతాళ్ వెబ్ సిరీస్,షారుఖ్ ఖాన్ బేతాళ్ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్
  షారుఖ్ ఖాన్ ‘బేతాళ్’ వెబ్ సిరీస్ పై వివాదం (Twitter/Photo)


  హార్రర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సిరీస్ కథ, తమ సినిమా విటాళ్ కథకు పోలికలున్నాయని స్క్రీన్ రైటర్స్ సమీర్, మహేశ్ ముంబాయి హైకోర్టును ఆశ్రయించారు. మేము మా కథను ఎంతో మంది దగ్గరకు వెళ్లాం. కానీ రెడ్ చిల్లీస్ సంస్థకు మాత్రం మా స్టోరీని చెప్పలేదన్నారు. మా ఐడియా వారికెలా తెలిసిందో అర్ధం కావడం లేదు. ఈ విషయమైన అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశాము. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్స్ మా కథను రిజిస్టర్ చేసుకున్నామన్నారు. ఇక మా దగ్గరున్న కథలోని చాలా సన్నివేశాలు ఈ  సిరీస్‌లో 10 వరకు ఒకేలా ఉన్నాయని వారు అన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు  ‘బేతాళ్’ షో ప్రసారంపై స్టే విధించింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: