కొందరు పెయిర్స్ చాలా బాగుంటుంది. ఆన్ స్క్రీన్ జనాల్ని ఇట్టే ఆకట్టుకుంటోంది. 80 నుంచి 90వరకు వరకు మనకు వెండితెరపై అనేక హిట్ పెయిర్స్ అలరించాయి. చాలామంది ఆన్ స్క్రీన్ హిట్ అయిన జంటలు నిజ జీవితంలో కూడా పెళ్లితో ఒక్కటయ్యారు. అలాంటి వారు సినీ ఇండస్ట్రీలు చాలామందే ఉన్నారు. కానీ ... కొందరు మాత్రం ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్‌గానే నిలిచిపోయారు. అలాంటిి ప్రముఖ జంటల్లో కాజల్, షారుక్ ఖాన్ ఒకరు. కాజల్, షారుక్ జంటగా వస్తున్నారంటే ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. బాజీగర్ నుంచి కబి ఖుషీ కబీ గమ్, కుచ్ కుచ్ హోతా హై, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే, దిల్ వాలే ఇలా ఏ సినిమా చూసినా హిట్టే.
అలాంటి హిట్ పెయిర్ మరోసారి జంటగా నటిస్తే.. ఇక అభిమానులకు పండగే పండగ. అలాంటి జంటని మళ్లీ మళ్లీ చూడాలని ఆశపడతారు. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, కాజోల్లది అలాంటి జోడీనే. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి బెస్ట్ పెయిర్‌గా నిలిచారు ఇద్దరూ. అజయ్ దేవగన్‌ని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు నటనకు బ్రేక్ ఇచ్చిన కాజోల్.. రీ ఎంట్రీ తర్వాత కూడా షారుఖ్‌తో కలిసి 'దిల్వాలే' మూవీ చేసింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలిసింది.
అయితే అది కొద్దిసేపేనట. రణ్వీర్ సింగ్, ఆలియాభట్ జంటగా కరణ్ జోహార్ డైరెక్ట్ చేస్తున్న 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' మూవీలో షారుఖ్, కాజోల్‌లు కాసేపు కనిపించనున్నారట. కొన్ని సీన్స్లోనా లేక ఏదైనా పాటలోనా అనేది తెలియాల్సి ఉంది. అయితే విషయం వైరల్ కావడంతో తమ ఫేవరేట్ కాంబో రిపీటవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ తమ కామెంట్స్‌తో సోషల్ మీడియాని నింపేస్తున్నారు ఫ్యాన్స్.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.