షబానా అజ్మీ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్..

ప్రముఖ నటి షబానా అజ్మీ నిన్న సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

news18-telugu
Updated: January 19, 2020, 12:19 PM IST
షబానా అజ్మీ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్..
Shabana Azmi (File)
  • Share this:
ప్రముఖ నటి షబానా అజ్మీ నిన్న సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైయింది. ముంబాయి, పూణే ఎక్స్ ‌ప్రెస్ హైవేపై ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో షబానా అజ్మీ‌తో పాటు ఆమె కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో షబానా అజ్మీతో పాటు ఆమె కారు డ్రైవర్‌ను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మరింత మెరుగైన చికిత్స కోసం ముంబయిలోకి కోకిలాబెన్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బాలీవుడ్‌లో ఆర్ట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు షబానా. అంతేకాదు ఉత్తమ నటిగా 5సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. ఇంకో విషయం ఏమంటే షబానా అజ్మీ స్వస్థలం హైదరాబాదే. అంతేకాదు షబానా ప్రముఖ నటి టబుకు స్వయంగా మేనత్త అవుతుంది.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు