వాత్సాయన కామసూత్రాలు నేర్పిస్తున్న సెన్సేషనల్ పాయల్ రాజ్‌పుత్..

నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. అమ్మో అమ్మో.. ఏంటీ తెగింపు అనేలా ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ మాటలున్నాయి. ఇక ఈమె నటించిన RDX లవ్ సినిమాలో కొన్ని సీన్స్ కూడా అలాగే ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 9, 2019, 9:15 PM IST
వాత్సాయన కామసూత్రాలు నేర్పిస్తున్న సెన్సేషనల్ పాయల్ రాజ్‌పుత్..
పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ పోస్టర్
  • Share this:
నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. అమ్మో అమ్మో.. ఏంటీ తెగింపు అనేలా ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ మాటలున్నాయి. ఇక ఈమె నటించిన RDX లవ్ సినిమాలో కొన్ని సీన్స్ కూడా అలాగే ఉన్నాయి. పైగా ఇప్పుడు విడుదలైన పోస్టర్‌లో హీరో చేతిలో వాత్సాయన కామసూత్ర పుస్తకం ఉంది. ఈ గ్రంథం చదువుతుంటే పక్కనే పాయల్ రాజ్‌పుత్ హొయలు పోతుంది. RX 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.. అందులోనే సంచలన పాత్రలో నటించింది. తనకు విమర్శలు వస్తాయని తెలిసినా కూడా ఆ సినిమాలో అలాంటి పాత్రలో నటించింది పాయల్. ఇప్పుడు మరోసారి అలాంటి సంచలన పాత్రతోనే వస్తుంది.

పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ పోస్టర్


ఈమె RDX లవ్ సినిమాతో అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. శంకర్ భాను తెరకెక్కించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. లేడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆడవాళ్లకు సంబంధించిన చాలా విషయాలు చర్చించామని చెబుతుంది పాయల్. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు పడే కష్టాలు.. ఆ తర్వాత సెక్స్ గురించి.. సెక్స్‌కు ముందు వాడే కండోమ్స్ గురించి అన్నీ ఇందులో చెప్పాం అంటుంది పాయల్.

పాయల్ రాజ్‌పుత్ RDX లవ్ పోస్టర్


ఈ విషయాల గురించి చెప్పడానికి చాలా మంది సిగ్గు పడటమో.. భయపడటమో చేస్తారని కానీ తాము మాత్రం ఈ విషయాలన్ని RDX లవ్ సినిమాలో చూపించామంటుంది పాయల్ రాజ్‌పుత్. ఈ విషయాలు చెప్పడానికి కూడా తాము సిగ్గు పడటం లేదని.. గర్వపడుతున్నాం అంటుంది ఈ బ్యూటీ. అపరిచితులతో సెక్స్ చేసారా అని టీజర్‌లో వచ్చిన డైలాగ్ చూసి తనను చాలా మంది తిట్టారని.. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత విమర్శించిన వాళ్లే ప్రశంసిస్తున్నారని చెప్పింది పాయల్ రాజ్‌పుత్. మొత్తానికి చూడాలిక.. పాయల్ చెప్పిన ఈ విషయాలతో RDX లవ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు పేలుతుందో..?
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading