బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ, గాల్లో తేలిన ఇలియానా.. ఇప్పుడు అన్నింటినీ వదిలేసి భూమ్మీదకు వచ్చింది. దేవదాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇల్లీ బేబీ.. తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్గా నిలిచింది. అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోయింది. కానీ, ఆ స్టార్‌డమ్‌ను కాపాడుకోలేకపోయింది. బాయ్‌ఫ్రెండ్‌తో సెటిలైపోదామనుకొని, సినిమా కెరీర్‌పై చిన్నచూపు చూసింది. దాంతో అవకాశాలన్నీ దూరమయ్యాయి. బాయ్‌ఫ్రెండ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. అయితే.. చేతిలో సినిమా అవకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్న ఈ బ్యూటీ దర్శకులను, హీరోలను ఆకర్షించేందుకు ముప్పుతిప్పలు పడుతోంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తన పుట్టిన రోజు నాడు బికినీ ఫోటోను షేర్ చేసి సెగలు పుట్టించింది. చిన్న బికినీలో సన్ బాత్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఇలియానా హాట్నెట్ పీక్ స్టేజ్‌లో ఉంది.
అయితే.. ఈ సెగలు పుట్టించే ఫోటోలు పోస్ట్ చేస్తోంది పొట్ట తిప్పలేనని సినీ విమర్శకులు అంటున్నారు. ఒకప్పుడు అవకాశాలను కాదనుకొని.. ఇప్పుడు అవే అవకాశాల కోసం ఒంపుసొంపులను ప్రదర్శిస్తోందని చెబుతున్నారు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. తాను స్కిన్ షోకు ఫుల్ సపోర్టు ఇస్తానని చెప్పకనే చెబుతోందని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇంతలా అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీకి ఇప్పటికైనా అవకాశాలు దక్కుతాయో.. లేదో.. మరి.
Published by:Shravan Kumar Bommakanti
First published:November 07, 2019, 11:18 IST