హోమ్ /వార్తలు /సినిమా /

అందుకే పూజా హెగ్డేకు వరుస ఆఫర్లు.. ఏ మాత్రం తగ్గేది లేదంటున్న బ్యూటీ..

అందుకే పూజా హెగ్డేకు వరుస ఆఫర్లు.. ఏ మాత్రం తగ్గేది లేదంటున్న బ్యూటీ..

పూజా హెగ్డే

పూజా హెగ్డే

Pooja Hegde : అందివచ్చిన అవకాశాలను నిండు దోసిలితో అందిపుచ్చుకుంటోంది పూజా హెగ్డే. దానికి కావాల్సిన అందచందాలు, ఎక్స్‌పోజింగ్, బికినీ.. లాంటి అస్త్రశస్త్రాలను ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రయోగిస్తోంది.

పూజా హెగ్డే.. ఇప్పుడు పెద్ద హీరోలందరికీ నోట్లో నానుతున్న పేరు. ఒక సినిమా చేస్తున్నామంటే అందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే ఉంటే బాగుంటుంది అన్న స్థాయికి ఈ బ్యూటీ చేరిపోయింది. తెలుగు, హిందీ అన్న తేడా లేకుండా సినిమా పరిశ్రమపై దండయాత్ర చేస్తోంది. అందివచ్చిన అవకాశాలను నిండు దోసిలితో అందిపుచ్చుకుంటోంది. దానికి కావాల్సిన అందచందాలు, ఎక్స్‌పోజింగ్, బికినీ.. లాంటి అస్త్రశస్త్రాలను ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రయోగిస్తోంది. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ మొదట్లో కాస్త ఇబ్బంది పడింది. ముకుంద సినిమా కూడా ఆమె కెరీర్‌కు అంతగా కలిసి రాలేదు. హిందీలో ఏకంగా హృతిక్ రోషన్ సరసన మొహంజోదారో సినిమాలో నటించినా ఆ సినిమా ప్లాఫ్ కావడంతో ఆమెను ఐరన్ లెగ్ అనుకున్నారంతా. కానీ.. అల్లు అర్జున్ హీరోగా డీజే(దువ్వాడ జగన్నాథం)తో ఫామ్‌లోకి వచ్చింది. ఎన్టీఆర్‌తో అరవింద సమేత, మహేష్ బాబుతో మహర్షి, వరుణ్ తేజ్ సరసన గద్దలకొండ గణేష్.. ఇలా పెద్ద హీరోలకు ఫస్ట్ ప్రియారిటీ అయ్యింది. ఇప్పుడు అల్లు అర్జున్ సరసన మరోసారి అల వైకుంఠపురం, మరో సినిమాలో నటిస్తోంది. తాజాగా.. దీపావళి సందర్భంగా విడుదల కానున్న హిందీ సినిమా హౌస్‌ఫుల్4 లోనూ తన అందాలతో అభిమానులకు కనువిందు అందించడానికి రెడీ అయ్యింది.


అయితే, పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు రావడానికి పూజా బాగానే కష్టపడింది. పెద్ద హీరోయిన్‌గా ఎదగాలంటే ‘షరతులు’ విధించకూడదని త్వరగానే అర్థం చేసుకుంది. అందుకే.. బికినీ వేయడానికి, లిప్‌లాక్ ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. తెలుగులో వరుస సినిమాల్లో అవకాశం రావడానికి ఇవే ప్రధాన కారణం. అంతేకాదు.. సాధారణంగా హీరోయిన్లు ఒక భాషలో ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపుతారు. కానీ, పూజా హెగ్డే.. కాల్షీట్లను సర్దుబాటు చేసుకుంటూ హిందీలోనూ రాణిస్తోంది. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ సరసన కూడా నటిస్తూ తన బాటను బంగారుమయం చేసుకుంటోంది.


గ్లామర్ షో ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రేక్షకుల మదిలో పదేళ్ల పాటు పదిలంగా ఉండాలంటే ఆ మాత్రం షో చేయక తప్పదని గ్రహించిన ఈ సెక్సీ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ కావడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. ఇక.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షోలతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. సోషల్ మీడియాకే వేడి పుట్టించేలా తన అందాలను ఆరబోస్తోంది. నాభి, క్లీవేజ్‌ను చూపిస్తూ.. జబర్దస్త్ ఫోటో షూట్లతో మరింత మంది అభిమానులను బుట్టలో వేసుకుంటోంది.


ఇదంతా ఎందుకంటే.. నంబర్ వన్ పీఠమే పూజా హెగ్డే లక్ష్యంగా కనిపిస్తోంది. వాస్తవానికి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే షరతులు అనేవి ఉండకూడదు. ఎక్స్‌పోజింగ్ చేయలేను అంటే కుదరదు. అవకాశాలు రావు. నాటి హీరోయిన్ల నుంచి.. కాజల్, సమంత, తమన్నా, రకుల్.. ఇలా అగ్రపీఠం కోసం పోటీపడ్డవారంతా ఆ బాటలో నడిచిన వారే. అదే విషయాన్ని పసిగట్టిన పూజా.. అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు. పైగా, సినిమా ప్రమోషన్ల కోసం కూడా హాట్ ఫోటోషూట్లు చేస్తూ హీట్ ఎక్కిస్తోంది. తాజాగా, హౌస్‌ఫుల్4 కోసం చేసిన ఫోటో షూట్ ఆ కోవలోదే. అందుకే అభిమానులు సైతం ఈ బ్యూటీని కలల రాకుమారిగా కొలుస్తున్నారు.

పూజా హెగ్డే ఊర మాస్..

First published:

Tags: Pooja Hegde, Telugu Movie News, Tollywood Movie News

ఉత్తమ కథలు