రివ్యూ: ‘సెవెన్’.. కథ ఉన్నా కథనం లేని క్రైమ్ డ్రామా..

జీనియ‌స్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన హీరో హ‌వీష్. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు ఈ హీరో. ఇప్పుడు సెవెన్ అంటూ మ‌రో ప్ర‌యోగంతో వ‌చ్చాడు. మ‌రి ఈ సారైనా ఈయ‌న స‌క్సెస్ అయ్యాడా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 6, 2019, 9:12 AM IST
రివ్యూ: ‘సెవెన్’.. కథ ఉన్నా కథనం లేని క్రైమ్ డ్రామా..
సెవెన్ మూవీ పోస్టర్
  • Share this:
రేటింగ్: 2/5
న‌టీన‌టులు: హ‌వీష్, రెజీనా, నందితా శ్వేత‌, పూజిత పొన్నాడ‌, రెహ‌మాన్, అదితి ఆర్య‌, అనీషా ఆంబ్రోస్ త‌దిత‌రులు

క‌థ, స్క్రీన్ ప్లే, నిర్మాత: ర‌మేష్ వ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌కుడు: నిజార్ ష‌ఫీ

జీనియ‌స్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన హీరో హ‌వీష్. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు ఈ హీరో. ఇప్పుడు సెవెన్ అంటూ మ‌రో ప్ర‌యోగంతో వ‌చ్చాడు. మ‌రి ఈ సారైనా ఈయ‌న స‌క్సెస్ అయ్యాడా..?

క‌థ‌:
కార్తిక్(హ‌వీష్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్. హాయిగా పెళ్లి చేసుకుని ఆయ‌న జీవితం ఆయ‌న గ‌డుపుతుంటాడు. అంత‌లోనే త‌న భ‌ర్త కార్తిక్ మిస్ అయ్యాడంటూ నందితా శ్వేత వ‌చ్చి పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తుంది. దానికంటే ముందే మ‌రో అమ్మాయి కూడా ఇదే తీరులో పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. చెన్నైలో కూడా ఇలాంటి కంప్లైంట్ ఒక‌టి రైజ్ అవుతుంది. దాంతో అమ్మాయిల‌ను మోసం చేస్తూ పెళ్లి చేసుకునే వాడిగా కార్తిక్ కేస్ ఫైల్ చేసి ధ‌ర్యాప్తు మొద‌లుపెడ‌తారు. కానీ అప్పుడే కార్తిక్ జీవితంలోకి స‌రస్వ‌త‌మ్మ‌(రెజీనా) వ‌స్తుంది. అస‌లు కార్తిక్ ఇలా మారిపోవ‌డానికి కార‌ణం ఆమె అని తెలుస్తుంది. దాని వెన‌క క‌థేంటి అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
సాధార‌ణంగా సైకో ల‌వ్ స్టోరీస్ అనేవి ఎప్పుడూ మేల్ డామినేటెడ్‌గానే ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం విచిత్రంగా అమ్మాయి వైపు నుంచి ఈ క‌థ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు నిజార్ ష‌ఫీ. సెవెన్ క‌థ మొద‌టి 15 నిమిషాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. మొద‌ట్లోనే మూడు మ‌ర్డ‌ర్స్.. ఆ వెంట‌నే భ‌ర్త మిస్సింగ్ కంప్లైంట్స్ ఇవ‌న్నీ సినిమాపై ఆస‌క్తి పెంచేస్తాయి. కానీ ఆ త‌ర్వాత అదే టెంపో కొన‌సాగించ‌డంలో మాత్రం ద‌ర్శ‌కుడు నిజార్ ఫెయిల్ అయ్యాడు. ఒక్క‌సారి కార్తిక్ కారెక్ట‌ర్ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత‌.. అదే స్పీడ్‌తో సినిమా ముందుకెళ్ల‌లేక‌పోయింది. భ‌ర్త మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చిన త‌ర్వాత రొమాన్స్, ల‌వ్ ట్రాక్ రావ‌డం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
అదంత ఆస‌క్తిక‌రంగా లేక‌పోవ‌డంతో క‌థ ముందుకెళ్ల‌నంటూ మొరాయించింది. అయితే మ‌ళ్లీ స‌స్పెన్స్ మొద‌లైన త‌ర్వాత ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడు.. నిజంగానే అమ్మాయిల‌ను మోసం చేస్తున్నాడా అనే కోణంలో కాకుండా క‌థ‌ను రొమాన్స్ అంటూ ప‌క్క‌దారి ప‌ట్టించే స‌రికి ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి ఆస‌క్తి త‌గ్గిపోతుంది. సెకండాఫ్ 1980 ఫ్లాష్ బ్యాక్ గ్రిప్పింగ్‌గా అనిపించ‌లేదు. రెజీనా ఉన్నంత సేపు బాగానే ఉన్నా ఆ త‌ర‌హా ప్రేమ‌క‌థ‌లు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు క‌నెక్ట్ అవుతాయ‌నేది మాత్రం ప్ర‌శ్నార్థ‌క‌మే. సైకోయిక్ ప్రేమికురాలిగా రెజీనా కొత్త‌గా ట్రై చేసింది కానీ అది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

న‌టీన‌టులు:
హ‌వీష్ న‌టుడిగా ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సినిమా సినిమాకు మెరుగ‌య్యే ప్ర‌య‌త్నం అయితే చేస్తున్నాడు. రెజీనా ఈ సినిమాలో త‌న‌లో మ‌రో కోణం చూపించింది. పూర్తిగా విల‌న్ అయిపోయి ర‌ప్ఫాడించింది. నందితా శ్వేత‌, త్రిదా చౌద‌రి, పూజిత పొన్నాడ‌, అదితి ఆర్య‌, అనీషా ఆంబ్రోస్ చిన్న చిన్న పాత్ర‌ల్లో మెరిసారు. వాళ్లంతా క‌థ‌లో క‌లిసిపోయిన పాత్రలే. రెహ‌మాన్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో బాగున్నాడు.

టెక్నిక‌ల్ టీం:
చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం బ‌లంగా మారింది ఈ చిత్రానికి. ముఖ్యంగా ఆర్ఆర్ బాగానే ఇచ్చాడు. అయితే పాట‌లు ఆక‌ట్టుకోలేదు. ప్ర‌వీణ్ కేఎల్ ఎడిటింగ్ అంత ఆక‌ట్టుకోలేదు. సెకండాఫ్ మ‌రీ వీక్ అనిపించింది. నిజార్ ష‌ఫీ సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఆయ‌నే ద‌ర్శ‌కుడు కావ‌డంతో కావాల్సిన ఔట్ పుట్ తీసుకున్నాడు. ఇక ద‌ర్శ‌కుడిగా నిజార్ ప‌నిత‌నం పూర్తిగా క‌నిపించ‌లేదు. అత‌డు తీసుకున్న పాయింట్ కొత్త‌గా అనిపించినా తీసిన విధానం మాత్రం అస్స‌లు ఆక‌ట్టుకోలేదు.

చివ‌ర‌గా ఒక్క‌మాట‌:
సెవెన్.. ఆస‌క్తిక‌రంగా సాగ‌లేని క్రైమ్ డ్రామా..
First published: June 6, 2019, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading