సెవెన్ మూవీ ట్రైలర్
కొన్ని సినిమాలు విడుదలయ్యేంత వరకు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. అలాంటి సినిమానే సెవెన్. హవీష్ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రెజీనా, నందిత శ్వేత, పూజిత పొన్నాడ, అదితి ఆర్య లాంటి వాళ్లంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. తమిళ నటుడు రెహమాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్గా సెవెన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రమేష్ వర్మ. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది. ఇందులో కూడా పూర్తిగా రొమాన్స్ విత్ సస్పెన్స్ చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా హవీష్ హీరోయిన్లతో చేసే రొమాన్స్ ట్రైలర్లో బాగా హైలైట్ అయింది. ఈ చిత్రం కచ్చితంగా తనకు బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు హవీష్. మరి చూడాలిక.. ఈ చిత్రంతో ఈ కుర్ర హీరో ఎలాంటి ఫలితం అందుకోబోతున్నాడో..?
First published:
May 9, 2019, 4:52 PM IST