Home /News /movies /

SERIAL ACTRESS CHETANA RAJ DIED DURING FAT SURGERY SB

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కాస్మోటిక్ సర్జరీ వికటించి నటి మృతి

చేతన రాజ్ (ఫైల్ పిక్)

చేతన రాజ్ (ఫైల్ పిక్)

చేతన తన తల్లిదండ్రులకు తెలియకుండా కాస్మోటిక్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రానికి ఆమె పరిస్థితి విషమంగా మారింది.

    సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో నటి చనిపోయింది. కన్నడ (Kannada)ఇండస్ట్రీలో ఇటీవలకాలంలో పలువురు నటీనటులు చనిపోయారు. తాజాగా బుల్లితెర నటి చేతన రాజ్‌(Chetana Raj) సోమవారం రాత్రి మరణించింది. సర్జరీ చేయించుకుంటున్న సమయంలో వైద్యం వికటించి 21 ఏళ్ల నటి చేతన రాజ్ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే నటి చేతన రాజ్ మరణించినట్లు ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లే.. కన్నడ టీవీ నటి చేతన సోమవారం (మే 16) ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఫ్యాట్ సర్జరీ(Fat Surgery) కోసం వెళ్లింది.

    అయితే తాను చికిత్స కోసం వెళ్తున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియదు. వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. అయితే సర్జరీ జరుగుతున్న సమయంలో నటి చేతన ఊపిరితిత్తుల్లో నీటి శాతం పెరిగడం వల్ల ఆమె ఆరోగ్యం విషమించింది. దీంతో వెంటనే ఆమెను మరో ఆస్పత్రికి తరలించారు. సమాచారాన్ని తెలుసుకున్న చేతన కుటుంబసభ్యులు హుటాహుటిని ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే మరోక ఆస్పత్రికి తరలించే లోగా నటి చేతన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమె హఠాన్మరణం కన్నడ నాట సంచలనంగా మారింది. చేతన మృతితో ఆమె కుటుంబం. సన్నిహితులు,బుల్లితెర నటులు షాక్ అవుతున్నారు.

    కాస్మోటిక్ సర్జరీ చేయంచుకోవడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తుంది. సర్జరీ అయిన సాయంత్రానికి ఆమె ఊపిరితిత్తుల్లో నీరు చేరింది. దీంతో ఆమె బాగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అయితే చేతనను ఐసీయూకు తరలించే లోపే చనిపోయినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆస్పత్రిలో సరైన వైద్య పరికరాలు లేకుండా చేతనకు డాక్టర్లు సర్జరీ చేశారని ఆరోపిస్తున్నారు. చేతన.. తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని ఉత్తర తాలూకాలోని అబ్బిగారేలో నివసిస్తుంది. అయితే సర్జరీ చేసిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తమ కుమార్తె మరణించిందని చేతన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలర్స్ కన్నడ ఛానెల్‌లో గీత, దొరేసాని, లీనింగ్ స్టేషన్ సీరియల్స్‌లో చేతన రాజ్ నటించారు. 'హవాయి' సినిమాలోనూ నటి చేతన రాజ్ నటించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Kannada actress, Kannada Cinema, Sandalwood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు