సీరియల్ షూటింగ్స్ నిలిపేయాల్సిందేనా.. మరో ఆప్షన్ లేదా..?

Serial shootings: క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త మూడు నెల‌లుగా ఇండ‌స్ట్రీతో పాటు టీవీ రంగం కూడా మూత పడిపోయింది. ఎలాంటి షూటింగ్‌లు లేకుండా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 4, 2020, 2:31 PM IST
సీరియల్ షూటింగ్స్ నిలిపేయాల్సిందేనా.. మరో ఆప్షన్ లేదా..?
(Telugu serials)
  • Share this:
క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త మూడు నెల‌లుగా ఇండ‌స్ట్రీతో పాటు టీవీ రంగం కూడా మూత పడిపోయింది. ఎలాంటి షూటింగ్‌లు లేకుండా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. లాక్‌డౌన్ దెబ్బ‌తో కోట్లాది రూపాయలు నష్ట్టం వచ్చింది కూడా. ప‌ని లేక‌ పాపం చాలా మంది సినీ కార్మికులు, క‌ళాకారులు పూట గడవని పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్లందరికీ తీపి కబురు చెప్తూ ఈ మధ్యే మళ్లీ షూటింగ్స్ చేసుకోండి అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గత రెండు వారాలుగా అన్నిచోట్లా కూడా సీరియల్ షూటింగ్స్‌తో పాటు రియాలిటీ షోలు కూడా బాగానే జరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు కూడా అలాగే పెరుగుతున్నాయి.

ఆర్ఎఫ్‌సీలో మొదలైన షూటింగ్ సందడి (serial shooting in rfc)
ఆర్ఎఫ్‌సీలో మొదలైన షూటింగ్ సందడి (serial shooting in rfc)


కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారమే ఆర్ఎఫ్‌సీతో పాటు హైదరాబాద్‌లోని పలు స్టూడియోస్‌లో ఈ సీరియల్ షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే సీరియల్ నటులు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్, నవ్య స్వామి, గృహలక్ష్మి సీరియల్ నటుడు హరికృష్ణతో ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ రవికృష్ణ కూడా కరోనా బారిన పడ్డాడు. దాంతో ఒక్కసారిగా అంతా షాక్ అయిపోయారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా సీరియల్ నటులకి రావడంతో మళ్లీ షూటింగ్స్ అన్నీ క్లోజ్ చేసారు. ఎన్ని చేసినా కూడా షూటింగ్స్ ఆపే వరకు ఈ కరోనా అరికట్టదని చెప్తున్నారు వైద్య నిపుణులు.

ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter
ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter


ఇవి పైకి కనిపించిన కొన్ని కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే. ఇంకా చాలా మందికి కరోనా వచ్చిందని ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే వాళ్లు కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లంతా టెస్టులు చేయించుకుని రిజల్ట్స్ కోసం చూస్తున్నారు.  ఇప్పటికే తమిళనాడులో సీరియల్ షూటింగ్స్ ఆపేయాలంటూ ఆజ్ఞలు వచ్చాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇదే జరగబోతుందేమో అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్స్ అంటే లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకోవడమే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా మాత్రం వదిలేలా కనిపించడం లేదు.

షూటింగ్స్‌కు మరోసారి బ్రేకులు (Shootings break in Tamil Nadu)
షూటింగ్స్‌కు మరోసారి బ్రేకులు (Shootings break in Tamil Nadu)


ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ కోవిడ్ 19ను ఆపడం అంత ఈజీ కాదని అర్థమైపోయింది. అందుకే మళ్ళీ షూటింగ్స్ ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు సినిమా షూటింగ్స్ అయితే జరగడం లేదు. హీరోలు ఇప్పట్లో బయటికి రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికి కరోనా విళయ తాండవం ఇలాగే సాగితే పరిస్థితులు రానురాను ఎలా ఉంటాయో ఊహించుకోడానికి కూడా భయంగానే ఉంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 4, 2020, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading