Serial Actor Jackie: బుల్లితెర నటుడు జాకీ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. బుల్లితెరలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ బుల్లితెరలో పలు సీరియల్స్ లో బిజీగా ఉంటూ తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన మరో నటి హరితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తన భార్య కోసం బాగా ఎమోషనల్ అయ్యాడు జాకీ.
ప్రస్తుతం తన భార్య హరితతో కలిసి ఓ సీరియల్ లో నటిస్తున్నాడు. ఇక వీరిద్దరూ బుల్లితెర ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా నిలిచారు. ఎన్నో షోలలో పాల్గొని ఎంతో సరదాగా సందడి చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా సుమ యాంకరింగ్ చేస్తున్న క్యాష్ షోలో పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
ఇందులో ఈ వారం జాకీ తన భార్య హరితతో పాల్గొన్నాడు. అంతేకాకుండా మరో బుల్లితెర నటి ప్రీతి తన భర్త నాగేష్ తో పాల్గొన్నారు. ఇందులో వీరి ఎంట్రీతో వీళ్ళ జంటలకు దండలు మార్పించింది సుమ. ఇక వెంటనే సుమ వారితో ఫన్నీగా మాట్లాడుతున్న సమయంలో జాకీ పక్కకు వెళ్లి కళ్ళు తుడుచుకుంటున్నట్లు కనిపించాడు.
వెంటనే సుమ జాకీని ఏంటి ఎమోషనలయ్యారా.. ఏడుస్తున్నారు అని ప్రశ్నించగా.. ఇప్పుడు కూడా ఈవిడేనా అంటూ తన భార్య హరితను ఉద్దేశించి పంచ్ వేశాడు. ఇక అందులో ప్రీతి భర్త నాగేష్ కూడా తన కామెడీతో బాగా నవ్వించాడు. సుమ పై ఫన్నీ కామెంట్స్ చేస్తూ నవ్వించారు.జాకీ..తన భార్య కోసం మద్యం కూడా మానేశాడట. ఇక మధ్యలో జాకీ, నాగేష్ ల మధ్య కాస్త ఫన్నీగా కనిపించింది. మరోవైపు ప్రీతి ఇంటిని నడిపించే వాళ్ళు ఆడవాళ్ళు.. ఆంటీని నడిపించేవాళ్లు మగవాళ్ళు అంటూ వ్యాఖ్యలు చేయగా అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు. మొత్తానికి ఈ ప్రోమో మొత్తం బాగా సరదాగా కనిపించగా.. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు తెగ లైక్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Cash promo, Haritha, Kunkumapuvvu serial, Serial actor jackie