Nani: ‘వి’ సినిమాలో అదే అదిరిపోయే ట్విస్ట్.. క్లైమాక్స్‌లో అరాచకం..

నాని వి సినిమా (nani sudheer V movie)

V the movie: నాని 25వ సినిమా ‘వి’ పై భారీ అంచనాలున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వేచి చూస్తే లాభం లేదని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు..

  • Share this:
నాని 25వ సినిమా ‘వి’ పై భారీ అంచనాలున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వేచి చూస్తే లాభం లేదని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా గురించి అభిమానులు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు నాని కూడా ఈ సినిమాతో కచ్చితంగా అలరిస్తానంటున్నాడు. తన 25వ సినిమా అందరికీ నచ్చుతుందని ధీమాగా చెప్తున్నాడు. ఎప్పుడూ రొటీన్‌గా కనిపించడం ఎందుకునే.. 25వ సినిమాను విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నానని చెప్పాడు నాని.
నాని వి సినిమా (nani sudheer V movie)
నాని వి సినిమా (nani v movie)

ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు నేచురల్ స్టార్. తన కెరీర్‌కు ప్రాణం పోసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 25వ సినిమా కూడా చేస్తున్నాడు నేచురల్ స్టార్. ఈ కాంబినేషన్‌లో వచ్చిన అష్టా చమ్మా, జెంటిల్ మెన్ సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. అమెజాన్ ప్రైమ్ వి సినిమా కోసం దాదాపు 35 కోట్ల వరకు డీల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఉందని ప్రచారం జరుగుతుంది.
నాని వి సినిమా (nani v movie)
నాని వి సినిమా (nani v movie)

ముందు నుంచి చెప్తున్నట్లు ఈ సినిమాలో నాని విలన్ రోల్‌లోనే నటిస్తున్నాడు. ఇక సుధీర్ బాబు హీరోగా కనిపిస్తున్నాడు. కానీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి కథ మొత్తం మారిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు విలన్‌గా ఉన్న నాని కాస్తా హీరో అయిపోతాడని.. హీరోగా ఉన్న సుధీర్ బాబు విలన్ అయిపోతాడని తెలుస్తుంది. ఇంద్రగంటి ఈ ట్విస్ట్‌ను అద్భుతంగా డిజైన్ చేసాడని సినిమా ప్రివ్యూ చూసిన వాళ్లే చెప్తున్న మాట. మొత్తానికి ఈ ట్విస్ట్ కానీ కరెక్టుగా వర్కవుట్ అయిందంటే వి రేంజ్ మారిపోవడం కూడా ఖాయం.
Published by:Praveen Kumar Vadla
First published: