నాగబాబుపై శ్రీ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. స్నేక్ బాబు ఎక్స్ ట్రా చేస్తే తాట తీస్తా..

శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని రోజులుగా ఈమె చాలా బిజీ అయిపోయింది. ఓ సారి దిశా కేస్ గురించి కన్నీరు పెట్టుకుంటుంది.. మరోవైపు పేదలకు అన్నం పెడుతున్నానంటుంది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 4, 2019, 5:53 PM IST
నాగబాబుపై శ్రీ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్.. స్నేక్ బాబు ఎక్స్ ట్రా చేస్తే తాట తీస్తా..
నాగబాబుకు శ్రీ రెడ్డి వార్నింగ్
  • Share this:
శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని రోజులుగా ఈమె చాలా బిజీ అయిపోయింది. ఓ సారి దిశా కేస్ గురించి కన్నీరు పెట్టుకుంటుంది.. మరోవైపు పేదలకు అన్నం పెడుతున్నానంటుంది.. ఇంకోవైపు రేపిస్టులను ఉరి తీయండి అంటూ నానా యాగీ చేస్తుంది. అరే శ్రీ రెడ్డి మారిపోయిందే అనుకునే లోపు.. లేదు తానింకా పాత శ్రీ రెడ్డినే.. ఏదో జస్ట్ కారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసానంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. ఈమె ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. అందులో పవన్ కల్యాణ్‌ను ఎప్పుడూ విమర్శిస్తూనే ఉండే శ్రీ రెడ్డి.. తాజాగా నాగబాబుపై పడింది.

Sensational Sri Reddy strong warning to Jabardasth old judge Nagababu and posted on him in Facebook pk శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని రోజులుగా ఈమె చాలా బిజీ అయిపోయింది. ఓ సారి దిశా కేస్ గురించి కన్నీరు పెట్టుకుంటుంది.. మరోవైపు పేదలకు అన్నం పెడుతున్నానంటుంది.. sri reddy,sri reddy facebook,nagababu,nagababu twitter,nagababu you tube channel,nagababu sri reddy,sri reddy warning to nagababu,jabardasth nagababu,jabardasth comedy show,nagababu quits jabardasth,sri reddy twitter,sri reddy instagram,sri reddy shyam prasad reddy,nagababu sri reddy warning,sri reddy pawan kalyan,sri reddy disha issue,telugu cinema,శ్రీ రెడ్డి,నాగబాబు,నాగబాబుకు శ్రీ రెడ్డి వార్నింగ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో
నాగబాబుకు శ్రీ రెడ్డి వార్నింగ్


ఏకంగా స్నేక్ బాబు అంటూ మొదలుపెట్టింది ఈమె. ఈ మధ్యే జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటికి వచ్చాడు నాగబాబు. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత అందులోంచి ఎందుకు రావాల్సి వచ్చిందో చెబుతూ వస్తున్నాడు మెగా బ్రదర్. అందులో భాగంగానే మల్లెమాలపై.. ఈటీవీపై కొన్ని వ్యంగ్యాస్త్రాలు కూడా వదిలాడు నాగబాబు. ఎవర్నీ పట్టించుకోలేదని.. కేవలం రేటింగ్స్ కోసమే పాకులాడారని.. కొందరు టీం లీడర్స్ కష్టాల్లో ఉన్నా కూడా ఎప్పుడూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి వచ్చి చూడలేదని విమర్శలు చేసాడు నాగబాబు. దాంతో ఇప్పుడు శ్రీ రెడ్డి ఈ విషయంపై చాలా సీరియస్ అయింది.

అసలు జబర్దస్త్ అనే ప్రోగ్రామ్‌కు ముందు నువ్వెక్కడున్నావ్.. అసలు నువ్వెవరు నాగబాబు అంటూ ప్రశ్నించింది ఈమె. దానికితోడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఓ పామును పెంచి కాటు వేయించుకుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. స్నేక్ బాబు నువ్వు రోజూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పు తీసుకెళ్లి పూజా చేయ్.. అప్పుడే నీకు బుద్ది వస్తుందంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఆయన జోలికి వస్తే నీ పాము పూస వదులుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి.

నీ లాంటి పనికిమాలిన వాళ్లకు జబర్దస్త్ కామెడీ షోలో ఛాన్స్ ఇచ్చి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఈటీవీ తప్పు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. ఏడేళ్లు మల్లెమాల, ఈటీవీ ఫుడ్ తిని కష్టాల్లో ఉన్నపుడు హెల్ప్ చేసిన వాళ్లను కాటు వేసి నీ పాము బుద్ది చూపించుకున్నావ్ కదరా అంటూ ఓ రేంజ్‌లో కామెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. దాంతో మెగాఫ్యాన్స్ ఎప్పట్లాగే శ్రీ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు అనవసరంగా మెగా కుటుంబాన్ని శ్రీ రెడ్డి టార్గెట్ చేస్తున్నావంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు అభిమానులు.
First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading