శ్రీ రెడ్డికి అమ్మోరు వచ్చేసిందంట.. వాళ్ళ తాట తీస్తానంటుంది..

శ్రీ రెడ్డి Facebook Photo

శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని రోజులుగా ఈమె చాలా బిజీ అయిపోయింది. ఓ సారి దిశా కేస్ గురించి కన్నీరు పెట్టుకుంటుంది.. మరోవైపు పేదలకు అన్నం పెడుతున్నానంటుంది..

  • Share this:
శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని రోజులుగా ఈమె చాలా బిజీ అయిపోయింది. ఓ సారి దిశా కేస్ గురించి కన్నీరు పెట్టుకుంటుంది.. మరోవైపు పేదలకు అన్నం పెడుతున్నానంటుంది.. ఇంకోవైపు రేపిస్టులను ఉరి తీయండి అంటూ నానా యాగీ చేస్తుంది. అరే శ్రీ రెడ్డి మారిపోయిందే అనుకునే లోపు.. లేదు తానింకా పాత శ్రీ రెడ్డినే.. ఏదో జస్ట్ కారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసానంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తాజాగా పేరు చెప్పకుండా అందరికీ మూడిందంటూ మరో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. వీలైనంత త్వరగా లైవ్‌లోకి వస్తానని.. అప్పుడు తన కోపాన్ని చూస్తారంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది శ్రీ రెడ్డి.

తాను ఇంకపై ఎవర్ని సహించేది లేదని.. అందరి తాట తీస్తానంటుంది. అంతేకాదు.. నా మీదకు అమ్మోరు వచ్చేసిందిరోయ్.. ఇక ఎవర్నీ వదిలేది లేదంటూ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. అసలెవర్ని ఉద్దేశ్యించి ఈ పోస్ట్ పెట్టిందనేది మాత్రం చెప్పలేదు శ్రీ రెడ్డి. కానీ అందర్నీ టార్గెట్ చేస్తుందనేది మాత్రం అర్థమవుతుంది. కొన్నేళ్లుగా వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా అందర్నీ నోటికొచ్చినట్లు తిట్టేస్తుంది శ్రీ రెడ్డి. ఇప్పుడు మరోసారి ఇదే చేయడానికి ఏకంగా లైవ్ ప్రోగ్రామ్ చేస్తానంటుంది. మరి శ్రీ రెడ్డి ఒంటిపైకి వచ్చిన అమ్మోరు ఎవర్ని టార్గెట్ చేస్తుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: