Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 21, 2019, 1:38 PM IST
శ్రీ రెడ్డి నాని ఫైల్ ఫోటోస్ (nani sri reddy)
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఐటి దాడుల కలకలం రేపుతుంది. ఉన్నట్లుండి జరిగిన ఐటి దాడులతో ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. నాని లాంటి స్టార్ హీరో.. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాతలపై ఐటి దాడులు జరగడం సంచలనమే. ఇక దీనిపై కూడా ఇప్పుడు టాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ శ్రీ రెడ్డి సంచలన పోస్ట్ చేసింది. ఈమె మరోసారి తన చేతికి పని చెప్పింది. ఐటి దాడులను సమర్థిస్తూ రెచ్చిపోయింది ఈమె. హైదరాబాద్‌లో జరిగిన ఐటీ దాడులపై ఆమె చాలా సంతోషపడుతుంది. ముఖ్యంగా తను ఎప్పట్నుంచో టార్గెట్ చేస్తున్న వాళ్లపైనే ఇప్పుడు ఐటి దాడులు జరగడంలో ఎగిరి గంతేస్తుంది.
సురేష్ బాబు తనయుడు అభిరామ్‌తో చాలా రోజులు ఈమె డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని అందరిముందు సాక్ష్యాలతో సహా బయటపెట్టింది కూడా. అలాంటి అభిరామ్ తండ్రి సురేష్ బాబు ఇల్లు, ఆఫీస్‌పై ఐటి దాడులు జరిగాయి. మరోవైపు తనను లైంగికంగా వాడుకున్నాడని హీరో నానిపై చాలా ఏళ్లుగా ఆమె నోరు పారేసుకుంటుంది. ఆ హీరోపై కూడా ఐటి దాడులు జరగడంతో మనశ్శాంతిగా కనిపించింది శ్రీ రెడ్డి.
అందుకే దేవుడు ఉన్నాడు సురేష్ బాబు గారూ అంటూ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. మరోవైపు మోదీజీ థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేసింది కూడా. శ్రీ రెడ్డి కమెంట్స్ చూసి చాలా మంది ఆమెకు సపోర్ట్ చేస్తుండటం విశేషం. మరికొందరు విమర్శిస్తున్నారు కూడా. అసలు నిజాలు పక్కనబెడితే శ్రీ రెడ్డి టార్గెట్ అయిన సురేష్ బాబు, నాని ఇంటిపై ఐటి దాడులు మాత్రం యాదృశ్చికమే.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 21, 2019, 1:38 PM IST