SENSATIONAL SRI REDDY CONTROVERSIAL COMMENTS ON ALLU ARJUN CAR AND KERALA FLOODS PK
అల్లు అర్జున్ కారుపై శ్రీ రెడ్డి ‘కారు’ కూతలు.. కంగ్రాట్స్ చెప్తూనే సెటైర్లు..
అల్లు అర్జున్ శ్రీ రెడ్డి (Source: Twitter)
శ్రీ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి నానా మాటలు అనేస్తుంటుంది. తనకు తాను ఇది కరెక్ట్ అని చెప్పుకుంటున్నా కూడా చూసే వాళ్లకు మాత్రం..
శ్రీ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి నానా మాటలు అనేస్తుంటుంది. తనకు తాను ఇది కరెక్ట్ అని చెప్పుకుంటున్నా కూడా చూసే వాళ్లకు మాత్రం ఎందుకో ఆమె ఎప్పుడూ తప్పుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడూ శ్రీ రెడ్డిపై ఫైర్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా అల్లు అర్జున్ కారుపై కారు కూతలు కూసింది ఈమె. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే ఈ మధ్యే బన్నీ కార్ కొన్నాడు.
అల్లు అర్జున్ కార్ (Source: Twitter)
మోస్ట్ స్టైలిష్ కార్ కావడంతో దీన్ని తన ఇంటి మెంబర్ అని పరిచయం చేసాడు అల్లు అర్జున్. దీనికి బీస్ట్ అనే పేరు కూడా పెట్టాడు బన్నీ. అయితే ఇప్పుడు ఈయన కార్ కొనడం శ్రీ రెడ్డికి నచ్చలేదు. అస్సలు నచ్చలేదు.. ఎంతలా అంటే మళ్లీ సోషల్ మీడియాలో నానా రచ్చ చేసేంతగా. ఈయన కార్ కొనడంతో కారు కూతలు కూసింది శ్రీ రెడ్డి. కార్ కొన్నందుకు కంగ్రాట్స్ చెప్తూ.. మరోవైపు సెటైర్లు కూడా వేసింది ఈ బ్యూటీ. ముఖ్యంగా బన్నీ బీస్ట్పై శ్రీ రెడ్డి కళ్లు పడ్డాయి. కోట్లు పెట్టి కొన్నావ్ కదా.. మరి నిన్ను అభిమానించిన కేరళ వాళ్లకు వరదలు వస్తే ఏం చేసావంటూ బన్నీని నిలదీసింది ఈ ముద్దుగుమ్మ.
కోట్లు విలువచేసే కారవాన్, రేంజ్ రోవర్ కార్లను కొన్నావు కాని.. కేరళ వరద బాధితులకు ఎంత సాయం చేశావ్.. అక్కడ నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా.. నువ్ వాళ్లకు హెల్ప్ చేస్తావని భావిస్తున్నా అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసి బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమ హీరో ఎంత మంచివాడో మీకేం తెలుసు.. ఆయనేం చేస్తున్నాడనేది మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదంటూ శ్రీ రెడ్డిపై అంతెత్తున లేస్తున్నారు. మొత్తానికి చూడాలిక.. శ్రీ రెడ్డి, బన్నీ వార్ ఎంతదూరం వెళ్లనుందో..?
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.