HOME »NEWS »MOVIE »sensational mass director koratala siva shocking decision over his retirement pk

కొరటాల శివ రిటైర్మెంట్.. సంచలన ప్రకటన చేసిన దర్శకుడు..

కొరటాల శివ రిటైర్మెంట్.. సంచలన ప్రకటన చేసిన దర్శకుడు..
కొరటాల శివ (koratala siva)

Koratala Siva: రాజమౌళి తర్వాత ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. సందేశాత్మక కథలను కమర్షియలైజ్ చేసి తెరకెక్కించడంలో ఈయన ఆరితేరిపోయాడు.

  • Share this:
అదేంటి.. అప్పుడే కొరటాల శివ రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటి.. ఈయన చేసిన సినిమాలెన్ని..? అయినా అంత త్వరగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు అనుకుంటున్నారా..? రాజమౌళి తర్వాత ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. సందేశాత్మక కథలను కమర్షియలైజ్ చేసి తెరకెక్కించడంలో ఈయన ఆరితేరిపోయాడు. ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు నాలుగే. 2013లో ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల.. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, భరత్‌ అనే నేను సినిమాలను తెరకెక్కించాడు. ఈ నాలుగు విజయం సాధించాయి.

కొరటాల శివ రిటైర్మెంట్ ప్లాన్స్ (koratala siva retirement)
కొరటాల శివ రిటైర్మెంట్ ప్లాన్స్ (koratala siva retirement)




దాంతో ఇప్పుడు సినిమాకు 20 కోట్ల వరకు పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ఈయన. ఆచార్యలో రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్‌ను కలుపుతున్నాడు ఈ దర్శకుడు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న దర్శకుడు.. ఉన్నట్లుండి రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా చెప్పేసాడు. అది విన్న తర్వాత నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. ఈ మధ్యే ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్‌ విషయాలు చెప్పాడు ఈ దర్శకుడు. దర్శకుడిగా తాను కేవలం 10 సినిమాలు మాత్రమే తెరకెక్కించాలని నిర్ణయించుకుని ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపాడు కొరటాల. తన పదో సినిమానే చివరిది అంటున్నాడు ఈయన.

కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)
కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)


ఈ స్థాయిలో ఉన్న దర్శకుడు పది సినిమాలకే రిటైర్మెంట్ తీసుకోవటం ఏంటనేది అర్థం కావడం లేదెవ్వరికి. కానీ తాను మాత్రం తన దగ్గరున్న 10 కథలు మాత్రమే డైరెక్ట్ చేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగినా కూడా దర్శకత్వం వైపు మాత్రం వెళ్లనని చెప్పాడు. నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందని మాత్రం తెలిపాడు ఈ దర్శకుడు. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు కొరటాల. ఈయన తీరు చూస్తుంటే భవిష్యత్తులో నిర్ణయం మార్చుకునేలా కనిపించడం లేదు. కొత్త వాళ్లు రావాలంటే ఉన్న దర్శకులు రిటైర్ కావాలంతే అంటున్నాడు ఈయన.

కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)
కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)


ఏదేమైనా కూడా కొరటాల లాంటి దర్శకుడు తలుచుకుంటే మళ్లీ కొత్త కథలు రాయలేడా.. అప్పుడే సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటున్నారు అభిమానులు. భరత్‌ అనే నేను సినిమా తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకున్న ఈయన ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో చరణ్ మాజీ నక్సలైట్ పాత్రలో నటించబోతున్నాడు. రామ్‌ చరణ్‌ కొణిదెల బ్యానర్‌తో కలిసి మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్. 2021 సమ్మర్‌లో సినిమా విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:April 15, 2020, 17:10 IST