Home /News /movies /

SENSATIONAL HERO VIJAY DEVARAKONDA TAKES PRIVATE JET AND PHOTOS GOING VIRAL IN SOCIAL MEDIA PK

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్ చూసారా.. దర్జాగా డాన్‌లా కూర్చున్నాడుగా..!

విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్ ఫోటోలు (Vijay Devarakonda/Twitter)

విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్ ఫోటోలు (Vijay Devarakonda/Twitter)

Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. అలా ఎదిగిన వాళ్లకు ఉండే క్రేజ్ గురించి చెప్పడం మామూలు విషయం కాదు. ఎప్పుడో 40 ఏళ్ళ కింద చిరంజీవి.. 20 ఏళ్ళ కింద రవితేజ.. 10 ఏళ్ల కింద నాని..

సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. అలా ఎదిగిన వాళ్లకు ఉండే క్రేజ్ గురించి చెప్పడం మామూలు విషయం కాదు. ఎప్పుడో 40 ఏళ్ళ కింద చిరంజీవి.. 20 ఏళ్ళ కింద రవితేజ.. 10 ఏళ్ల కింద నాని.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. ఇలా చెప్పాలి. వీళ్లకు బ్యాగ్రౌండ్ లేదు.. తాము నిలబడిన గ్రౌండ్‌నే బ్యాగ్రౌండ్‌గా మార్చుకుని ఇండస్ట్రీలో స్టార్స్ అయ్యారు. మరీ ముఖ్యంగా నాని సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్.. ఇప్పుడు నేచురల్ స్టార్ కంటే రెండాకులు ఎక్కువే చదివాడు. క్రేజ్‌లో ఆయన కంటే రెండు మూడు అడుగులు ముందే ఉన్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఈయన ప్రైవేట్ జెట్ తీసుకున్నాడు. ఇందులో ఉన్న పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు మూడు వరస ఫ్లాపులు వస్తే వచ్చిన క్రేజ్ ఇట్టే ఎగిరిపోతుంది. కానీ అలా వచ్చినా కూడా మార్కెట్ పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది విజయ్ దేవరకొండను చూస్తుంటే అర్థమైపోతుంది. తన క్రేజ్ ఇంత కూడా పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాడు ఈయన. అందుకే మొన్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న లైగర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైతే బీర్ అభిషేకాలు చేయడం.. చేతుల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం చేసారు అభిమానులు. దీన్నిబట్టి విజయ్ క్రేజ్ ఏంటనేది అర్థమైపోతుంది.

vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda instagram,vijay devarakonda movies,vijay devarakonda private jet,vijay devarakonda liger movie release date,vijay devarakonda private jet photos,vijay devarakonda takes private jet,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్,విజయ్ దేరవకొండ లైగర్ సినిమా
విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్ ఫోటోలు (Vijay Devarakonda/Twitter)

తాజాగా ప్రైవేట్ జెట్‌లో విజయ్ దేవరకొండ ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. అందులో సూపర్ స్టైలిష్‌గా కూర్చుని కాలు మీద కాలేసుకుని తింటున్నాడు విజయ్. అయినా తెలుగులో చాలా మంది హీరోల దగ్గర జెట్స్ ఉన్నాయి. నాగార్జున, చిరంజీవి, అల్లు అర్జున్ సహా ఇంకా చాలా మంది హీరోలు వీటిని ఎన్నో ఏళ్లుగా మెయింటేన్ చేస్తున్నారు. తమ ప్రస్టేజ్ సింబల్‌గా దీన్ని చూపిస్తుంటారు వాళ్లు. విజయ్ దేవరకొండ సైతం ఓ ప్రైవేట్ జెట్ తీసుకున్నాడు.

vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda instagram,vijay devarakonda movies,vijay devarakonda private jet,vijay devarakonda liger movie release date,vijay devarakonda private jet photos,vijay devarakonda takes private jet,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్,విజయ్ దేరవకొండ లైగర్ సినిమా
విజయ్ దేవరకొండ ప్రైవేట్ జెట్ ఫోటోలు (Vijay Devarakonda/Twitter)

అందులోనే కూర్చుని ఫోజులు ఇచ్చాడు. ఇవి చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమాలు మాత్రమే కాకుండా బిజినెస్‌లోనూ విజయ్ దేవరకొండ దూకుడు చూపిస్తున్నాడు. రౌడీ పేరుతో ఈయన లాంఛ్ చేసిన క్లోత్స్ రికార్డులు సృష్టించాయి. కెరీర్ పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్నాడు విజయ్. పూరీ జగన్నాత్ లైగర్ సినిమా తర్వాత సుకుమార్, కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులు ఈయన కోసం లైన్‌లో ఉన్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు