హోమ్ /వార్తలు /సినిమా /

TV actor Achyuth: టీవీ నటుడు అచ్యుత్ ఎలా చనిపోయాడో తెలుసా.. నమ్మినోళ్లే వెన్నుపోటు పొడవడంతో తట్టుకోలేక..

TV actor Achyuth: టీవీ నటుడు అచ్యుత్ ఎలా చనిపోయాడో తెలుసా.. నమ్మినోళ్లే వెన్నుపోటు పొడవడంతో తట్టుకోలేక..

టీవీ నటుడు అచ్యుత్ (TV Actor Achyuth)

టీవీ నటుడు అచ్యుత్ (TV Actor Achyuth)

TV actor Achyuth: తెలుగు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఓ వెలుగు వెలిగిన నటుడు ఆయన. చాలా తక్కువ సమయంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ నటుడు కేవలం 42 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అచ్యుత్ చనిపోయి 20 ఏళ్లు కావొస్తున్నా కూడా ఇప్పటికీ ఆయన స్క్రీన్ పై కనిపిస్తే..

ఇంకా చదవండి ...

బంగారం లాంటి భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తుండగా చాలా చిన్న వయసులోనే కొందరు సినీ ప్రముఖులు కన్నుమూస్తుంటారు. అలాంటి వాళ్ల మరణం చూసినపుడు చాలా కాలం పాటు అభిమానులు ఆ విషాదంలోంచి బయటికి కూడా రాలేరు. తెలుగు బుల్లితెరపై అలాంటి మరణం అచ్యుత్‌ది. ఈయన గురించి ఈ తరానికి పరిచయం చేయాలేమో కానీ గత తరం వాళ్లకు అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఓ వెలుగు వెలిగిన నటుడు ఆయన. చాలా తక్కువ సమయంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ నటుడు కేవలం 42 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. అచ్యుత్ చనిపోయి 20 ఏళ్లు కావొస్తున్నా కూడా ఇప్పటికీ ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఆ రోజుల్లోకి వెళ్లిపోతుంటారు అభిమానులు. అంతగా తనకంటూ గుర్తింపు సంపాదించుకుని.. బుల్లితెరపై ముద్ర వేసి వెళ్లిపోయాడు. 1990లలో దూరదర్శన్‌తో పాటు ఈటీవీలో వచ్చే సీరియల్స్‌తో చాలా ఫేమస్ అయ్యాడు అచ్యుత్. అంతేకాదు సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేసాడు, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ హీరోలందరితోనూ నటించాడు. తాను సినిమాల్లోకి రావడానికి ఆదర్శం చిరంజీవి అని చెప్పిన అచ్యుత్.. ఆయనతో కలిసి హిట్లర్‌లో నటించే అవకాశం వచ్చినపుడు గాల్లో తేలిపోయాడు. ఆ తర్వాత చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’, ‘డాడీ’ సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటించాడు.

telugu actor achyuth,tv actor achyuth,facts about actor achyuth,unknown facts about actor achyuth,about actor achyuth,actor achyuth movies,actor achyuth family,actor achyuth interview,actor achyuth unknown facts,actor achyuth family photos,reveals facts about actor achyuth,actor sravani death story,tollywood about actor achyuth,shocking facts about actor achyuth,తెలుగు నటుడు అచ్యుత్,టీవీ నటుడు అచ్యుత్ మరణం,టీవీ నటుడు అచ్యుత్ మరణం వెనక రహస్యాలు
టీవీ నటుడు అచ్యుత్ (TV Actor Achyuth)

పవన్ నటించిన ‘గోకులంలో సీత’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’ సినిమాలలో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు అచ్యుత్. నరసింహనాయుడులో బాలయ్య అన్నయ్యగా నటించాడు ఈయన. ఇతన్ని చూస్తుంటే నిజంగానే సొంత అన్నయ్యను చూసినట్టు అనిపిస్తుందని పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు చెప్పేవాడని అచ్యుత్ అప్పట్లో చెప్పేవాడు. అలాంటి అద్భుతమైన నటుడు కేవలం 42 ఏళ్లకే మరణించాడు. అది కూడా కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడు మరణించడం అందరినీ కలచివేసింది.

telugu actor achyuth,tv actor achyuth,facts about actor achyuth,unknown facts about actor achyuth,about actor achyuth,actor achyuth movies,actor achyuth family,actor achyuth interview,actor achyuth unknown facts,actor achyuth family photos,reveals facts about actor achyuth,actor sravani death story,tollywood about actor achyuth,shocking facts about actor achyuth,తెలుగు నటుడు అచ్యుత్,టీవీ నటుడు అచ్యుత్ మరణం,టీవీ నటుడు అచ్యుత్ మరణం వెనక రహస్యాలు
టీవీ నటుడు అచ్యుత్ (TV Actor Achyuth)

2002 డిసెంబర్ 26న అచ్యుత్ చనిపోయాడు. అయితే అచ్యుత్ చనిపోవడానికి కారణం వ్యాపారంలో నష్టాల పాలు కావడం.. దాంతో వచ్చిన మానసిక ఒత్తిడి అంటారు అతడి స్నేహితులు. సినిమాల్లో సంపాదించిందంతా వ్యాపారాల్లో పెట్టడం.. నమ్ముకున్న స్నేహితులే దాన్ని నట్టేటా ముంచడంతో ఆయన కోలుకోలేకపోయాడంటారు సన్నిహితులు. అప్పులు పాలైపోవడంతో.. మానసిక ఒత్తిడి పెరిగి గుండెపోటుతో మరణించినట్టు అప్పట్లో ఆయనతో ఉన్న కొందరు టీవీ నటులు చెప్పేమాట.

telugu actor achyuth,tv actor achyuth,facts about actor achyuth,unknown facts about actor achyuth,about actor achyuth,actor achyuth movies,actor achyuth family,actor achyuth interview,actor achyuth unknown facts,actor achyuth family photos,reveals facts about actor achyuth,actor sravani death story,tollywood about actor achyuth,shocking facts about actor achyuth,తెలుగు నటుడు అచ్యుత్,టీవీ నటుడు అచ్యుత్ మరణం,టీవీ నటుడు అచ్యుత్ మరణం వెనక రహస్యాలు
టీవీ నటుడు అచ్యుత్ (TV Actor Achyuth)

అప్పటికే దాదాపు 40 లక్షల వరకు ఈయన అప్పు చేసాడు. బిజినెస్‌కు దూరంగా ఉండి.. కేవలం కెరీర్‌పై ఫోకస్ చేసుంటే ఈ రోజుకు కూడా అచ్యుత్ బతికుండే వాడని అతడితో ఉన్న అశోక్ కుమార్ లాంటి నటులు చెప్తుంటారు. ఇక్కడ విషాదం ఏంటంటే ఆయన తండ్రి కూడా దాదాపు ఇదే వయసుకు చనిపోవడం. అచ్యుత్ పూర్తి పేరు కూనపరెడ్డి అచ్యుత వర ప్రసాద్. ఈయన సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం. ఇతని భార్య పేరు రామా దేవి. ఇతనికి ఇద్దరు కూతుర్లు.. వాళ్ళ పేర్లు సాయి సుజాత, సాయి శివాని. ప్రస్తుతం అచ్యుత్ కుటుంబం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. చాలా కాలంగా వీళ్లెక్కడున్నారనేది కూడా ఎవరికీ తెలియదు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Television News, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు