Sukumar Pushpa: ‘పుష్ప’ విషయంలో సుకుమార్ అనూహ్య నిర్ణయంతో నిర్మాతలు షాక్..

పుష్ఫ మూవీ పోస్టర్ (Sukumar)

Sukumar Pushpa: తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు ఉన్నారు.. వాళ్లు ఒక్కో సినిమాను ఏళ్లకేళ్లు తీస్తూనే ఉంటారు.. తీస్తారనే కంటే కూడా చెక్కుతూనే ఉంటారని చెప్పడం కరెక్ట్. అలాంటి దర్శకులలో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన డైరెక్టర్ సుకుమార్.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు ఉన్నారు.. వాళ్లు ఒక్కో సినిమాను ఏళ్లకేళ్లు తీస్తూనే ఉంటారు.. తీస్తారనే కంటే కూడా చెక్కుతూనే ఉంటారని చెప్పడం కరెక్ట్. అలాంటి దర్శకులలో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన డైరెక్టర్ సుకుమార్. ఈ లెక్కల మాస్టారు ఓ పట్టాన తన సినిమాను పూర్తి చేయడు. ఎప్పుడో 2018లో రంగస్థలం సినిమా చేస్తే ఇప్పటి వరకు మరో సినిమా విడుదల చేయలేదు ఈయన. ప్రస్తుతం ఈయన శిష్యుడు తెరకెక్కించిన ఉప్పెన సినిమా సాధించిన విజయంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. దాంతో పాటు తన సినిమా పుష్పపై కూడా ఫోకస్ చేసాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బన్నీ నుంచి అల వైకుంఠపురములో.. సుకుమార్ నుంచి రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి కూడా అలాగే ఉంది. బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతుంది. ఇప్పటికే పుష్ప షూటింగ్ సగానికి పైగా పూర్తైపోయింది. ఎర్రచందనం నేపథ్యంలో వస్తున్న కథ కావడంతో ఎక్కువ భాగం అడవుల్లోనే ప్లాన్ చేసాడు సుకుమార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవుల్లో షూటింగ్ అంటే అంత ఈజీ కాదు. మొన్నటి వరకు ఏపీలోని మామిడిపల్లి సమీపంలో పుష్ప షూటింగ్ చేసాడు సుకుమార్. అయితే కరోనా కారణంగా యూనిట్‌లో ఓ సభ్యుడు చనిపోవడంతో షూటింగ్‌కు ప్యాకప్ చెప్పారు.
sukumar,sukumar twitter,sukumar pushpa movie,sukumar pushpa movie shooting,sukumar pushpa allu arjun,sukumar pushpa shooting sets,pushpa set in hyderabad,telugu cinema,పుష్ప,సుకుమార్ పుష్ప షూటింగ్,పుష్ప కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్
సుకుమార్ (Sukumar)

పైగా ప్రతీసారి అడవుల్లో షూటింగ్ అంటే అందరి డేట్స్ ఒకేసారి తీసుకోవడం కష్టంగానే మారుతుంది. అందుకే సుకుమార్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో నిర్మాతలు ముందు షాక్ తిన్నా ఆ తర్వాత ఓకే అన్నారని తెలుస్తుంది. పైగా రిలీజ్ డేట్ కూడా తన్నుకుంటూ వచ్చేస్తుంది.
sukumar,sukumar twitter,sukumar pushpa movie,sukumar pushpa movie shooting,sukumar pushpa allu arjun,sukumar pushpa shooting sets,pushpa set in hyderabad,telugu cinema,పుష్ప,సుకుమార్ పుష్ప షూటింగ్,పుష్ప కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్
అల్లు అర్జున్ (Twitter/Photo)

ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నామని ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇప్పటి పరిస్థితుల్లో లేనిపోని రిస్కులు తీసుకోవడం యిష్టం లేని సుకుమార్.. అడవుల సెట్ హైదరాబాద్‌లోనే వేయిస్తున్నాడు. ఇక్కడే మిగిలిన మొత్తాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు లెక్కల మాస్టారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో పుష్ప సినిమాను నిర్మిస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: